ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చారిత్రక గండిపేట, హిమాయత్ సాగర్ జలాశయలాలలోకి భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది… ఎగువ ప్రాంతాలైన చేవెళ్ళ, మొయినాబాద్, శంషాబాద్, మోమిన్‌పేట్, వికారాబాద్, శంకర్‌పల్లి మండలాల నుండి పెద్ద ఎత్తున వరద నీరు(Flood water) జంట జలాశయాలలోకి వచ్చి చేరుతుంది. దీంతో జలమండలి డిజిఎం నరహరి గండిపేట జలాశయం వద్ద 10. గేట్లు 6. ఫీట్ల మేర ఎత్తి మూడీ లోకి 6370.క్యూసెక్కుల నీటిని వదిలిపెట్టారు..
Telugu News: Rain alert: ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం
దీంతో… నార్సింగి ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ బ్రిడ్జి(Outer Ring Road Exit Bridge) పైనుండి వరద పారుతుంది… అలాగే నార్సింగి-మంచిరేవుల బ్రిడ్జ్ పైనుండి మూడు అడుగుల మేర వరద పారుతుంది… ఈ రెండు ప్రాంతాలలో నార్సింగి పోలీసులు పికెట్లు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపి వేశారు…
గండిపేట, హిమాయత్ సాగర్‌కు వరద నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా ఈ రెండు రిజర్వాయర్లలోకి వరద నీరు చేరుతోంది.
వరద నీళ్లు చేరడంతో ఎలాంటి ప్రభావం ఉంటుంది?
నీటి మట్టం పెరగడం వల్ల గేట్లు ఎత్తే అవకాశం ఉంది. దీంతో ముసి నదిలో నీరు విడుదలవుతుంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: