📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telangana: తెలంగాణలో వడదెబ్బలపై ఎక్స్ గ్రేషియా రూ.4 లక్షలకు పెంపు

Author Icon By Digital
Updated: May 3, 2025 • 12:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Telangana : తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్న ఎండలు, వడగాలుల తీవ్రత దృష్ట్యా ప్రజలను రక్షించడం ప్రభుత్వ ప్రథమ బాధ్యతగా భావిస్తున్నట్లు రెవెన్యూ, హౌసింగ్, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. 2025లో జూన్ వరకు అధిక ఉష్ణోగ్రతలు ఉండే అవకాశముందని భారత వాతావరణశాఖ (IMD) హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రంలోని 12 శాఖలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్ హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ 2025 (HAP-2025)ను రూపొందించామని, ప్రతి జిల్లాకు నోడల్ అధికారులను నియమించినట్లు మంత్రి తెలిపారు.వడదెబ్బ వల్ల జరిగే మృతుల కుటుంబాలకు ఇప్పటి వరకు ఇచ్చే ఎక్స్ గ్రేషియోను రూ.50 వేలు నుండి రూ.4 లక్షల వరకు పెంచినట్లు మంత్రి ప్రకటించారు. ఇది మానవతా దృక్పథంతో తీసుకున్న కీలక నిర్ణయంగా చెబుతున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం 588 మండలాలను వడగాలుల ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించి, రాష్ట్ర విపత్తు నిబంధనల ప్రకారం ప్రత్యేక డిజాస్టర్‌గా హీట్ వేవ్‌ను మార్చినట్లు వెల్లడించారు.

Telangana: తెలంగాణలో వడదెబ్బలపై ఎక్స్ గ్రేషియా రూ.4 లక్షలకు పెంపు

Telangana : తెలంగాణలో ఎక్స్ గ్రేషియా రూ.4 లక్షలకు పెంపు

ఈ పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వ శాఖలు కలసి పనిచేయాలని సూచించారు. ప్రధానంగా హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్, నిజామాబాద్, కొత్తగూడెం, మెదక్, కరీంనగర్ తదితర పట్టణాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని, వాటిలో త్రాగునీరు, ఓఆర్ఎస్, మజ్జిగ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. సిఎస్ఆర్ కింద సంస్థలు ఈ అవసరాలను తీర్చేందుకు ముందుకు రావాలని సూచించారు.అలాగే ఆసుపత్రులలో ఫైర్ సేఫ్టీ ఆడిట్ నిర్వహణ, కూల్ వార్డులు ఏర్పాటు చేయాలని, ప్రజలకు వడగాలుల ప్రభావం తక్కువగా ఉండేలా ముందస్తు హెచ్చరికలు అందించాల్సిన అవసరాన్ని మంత్రి స్పష్టం చేశారు. ఏదైనా అనుకోని ప్రమాదాలు సంభవించినప్పుడు, తక్షణమే సహాయం అందించేలా వ్యవస్థలు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.

Read More : Bilawal Bhutto: ఉగ్రవాదులతో తమ సంబంధం నిజమే: బిలావల్ భుట్టో

Breaking News in Telugu ex-gratia hike 2025 HAP 2025 action plan Latest News in Telugu Paper Telugu News ponguleti srinivas reddy Telangana heatwave Telugu News Telugu News online

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.