తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిపై బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ఒకసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (chandrababu naidu) తన గురువు అని చెప్పడాన్ని రేవంత్ తీవ్రంగా ఖండిస్తారని, కానీ ఇటీవల మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడిని కలిసిన సందర్భంలో చంద్రబాబే తన గురువు అని తానే స్వయంగా అంగీకరించారని ఎద్దేవా చేశారు. ఒకసారి దేవతలా, మరోసారి బలిదేవతలా మాట్లాడటం రాజకీయ ద్వంద్వ ధోరణికి నిదర్శనమన్నారు.
Read also: Telangana: నేడు రాష్ట్రవ్యాప్తంగా వరదలు, ప్రమాదాలపై మాక్ ఎక్సర్ సైజ్
Telangana
కేసీఆర్ పాలనలో
తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని స్పష్టం చేశారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా దేశానికే ఆదర్శంగా ఎదిగిందని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో జీఎస్‌డీపీ మూడు రెట్లు పెరిగిందని, తలసరి ఆదాయం గణనీయంగా మెరుగుపడిందని గుర్తు చేశారు.
అయితే రెండేళ్లుగా నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికీ పూర్తి స్థాయిలో సిద్ధంగా లేరని హరీశ్ రావు విమర్శించారు. సగం సగం ప్రెస్‌మీట్లు పెట్టి ప్రభుత్వ ప్రతిష్ఠను తగ్గిస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాల కోసం రాష్ట్ర పరువును తాకట్టు పెట్టడం సరికాదని రేవంత్ రెడ్డికి హితవు పలికారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: