తెలంగాణ (Telangana) లో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందడుగు వేసింది. ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ లక్ష్యంగా నిర్దేశించుకున్న హస్తం పార్టీ, తాజాగా కీలక నియామకాలు చేసింది. దీనిలో భాగంగా మంగళవారం ఇద్దరు నేతలకు పార్టీ అధిష్టానం కీలక బాధ్యతలను అప్పగించింది.
Read Also: TG: హైదారాబాద్‌లో భారీగా ఓటర్ల తొలగింపు?
అత్యంత ప్రతిష్ఠాత్మకం
వీరిలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Telangana) కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి కూడా ఉన్నారు. త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విజయం సాధించడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ఈ క్రమంలోనే ఎన్నికల వ్యూహాలను పర్యవేక్షించేందుకు టీపీసీసీ ప్రత్యేకంగా ‘వార్ రూమ్’ను ఏర్పాటు చేసింది. దీనికి చైర్మన్‌గా గుత్తా అమిత్ రెడ్డిని నియమిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకం తక్షణమే అమలులోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: