Telangana: గురుకుల విద్యార్థి ఆత్మహత్యాయత్నం

Read Time:  1 min
Telangana: గురుకుల విద్యార్థి ఆత్మహత్యాయత్నం
FONT SIZE
GET APP

తెలంగాణ (Telangana) లోని, నల్గొండ జిల్లా తిప్పర్తిలోని ఎస్సీ గురుకుల పాఠశాలలో చోటుచేసుకున్న ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఏడో తరగతి చదువుతున్న వేముల శివ సాయి అనే విద్యార్థి పాఠశాల భవనం పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో శివ సాయికి రెండు కాళ్లు విరిగి, తీవ్ర గాయాలయ్యాయి.

Read Also: HighSpeed Train: హైదరాబాద్–వరంగల్‌కు నమో భారత్ ర్యాపిడ్ రైలు

Telangana: Gurukul student attempts suicide

టీచర్ మల్లయ్య, ప్రిన్సిపాల్ సునీత పై తల్లి ఆరోపణలు

ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. టీచర్ మల్లయ్య, ప్రిన్సిపాల్ సునీత తనను తరచూ వేధిస్తున్నారని శివసాయి గతంలో చెప్పాడని విద్యార్థి తల్లి ఆరోపించారు. ఆసుపత్రిలో చేర్పించిన తర్వాత పాఠశాల యాజమాన్యం తమ కొడుకును చూడటానికి రాలేదని, ఆపరేషన్ కూడా చేయించలేదని, ఆమె వాపోయారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.