📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేడు తెలంగాణ గ్రూప్‌-1 ఫలితాలు విడుదల

Author Icon By sumalatha chinthakayala
Updated: March 10, 2025 • 11:26 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్‌: తెలంగాణలో గ్రూప్స్ ఫలితాల విడుదలకు సంబంధించి షెడ్యూల్‌ను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రకటించింది. నేడు గ్రూప్‌-1,ఫలితాలను విడుదల చేయనున్నట్లు కమిషన్‌ తెలిపింది.మొత్తం 563 పోస్టులకు‌గానూ గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన మెయిన్స్‌కు 21,093 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్‌ జాబితా సిద్ధం చేసేందుకు కమిషన్‌ తుది పరిశీలన నిర్వహిస్తోంది. ఇక రేపు గ్రూప్-2 అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ లిస్ట్, 14న గ్రూప్-3 పరీక్ష జనరల్ ర్యాంకింగ్ జాబితాను రిలీజ్ చేయనున్నారు.

ఫలితాల విడుదల షెడ్యూల్

.మార్చి 10 – గ్రూప్‌-1 ఫలితాల విడుదల, ప్రొవిజినల్ మార్కుల వెల్లడింపు.
.మార్చి 11 – గ్రూప్‌-2 జనరల్ ర్యాంకింగ్ జాబితా విడుదల.
.మార్చి 14 – గ్రూప్‌-3 జనరల్ ర్యాంకింగ్ జాబితా విడుదల.
.మార్చి 17 – హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ తుది ఫలితాల ప్రకటన.
.మార్చి 19 – ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ తుది ఫలితాల విడుదల.
.అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన గ్రూప్-1 ఫలితాల విడుదల అనంతరం చేపట్టనున్నారు.

ఆ ప్రక్రియ ముగిసిన అనంతరం 1:2 నిష్పత్తిలో జాబితా

గ్రూప్‌-1 ప్రధాన పరీక్షలకు 21,093 మంది హాజరయ్యారు. ఫలితాల వెల్లడిలో భాగంగా మొదట ప్రధాన పరీక్షల మార్కుల ప్రకటనతో గ్రూప్‌-1 తుది నియామక ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆ తరువాత అభ్యర్థుల నుంచి రీకౌంటింగ్‌ ఆప్షన్లు స్వీకరించి, ఆ ప్రక్రియ ముగిసిన అనంతరం 1:2 నిష్పత్తిలో జాబితా వెల్లడించనుంది. అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను టీజీపీఎస్సీ వెబ్‌సైట్లో పొందుపరచనున్నట్లు కమిషన్‌ తెలిపింది.

Breaking News in Telugu Google news Google News in Telugu Group-1 results Latest News in Telugu Paper Telugu News Telangana Telugu News online

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.