Group 1 judgement telangana: గ్రూప్-1 అభ్యర్థులకు ఊరట

Read Time:  1 min
Group 1 judgement telangana: గ్రూప్-1 అభ్యర్థులకు ఊరట
FONT SIZE
GET APP

Group 1 judgement telangana : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటిసారిగా నిర్వహించిన గ్రూప్-1 నియామకాలపై గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సీజే ధర్మాసనం గురువారం రద్దు చేస్తూ తుది తీర్పును ప్రకటించింది. హైకోర్టు తీర్పుతో గ్రూప్-1లో నియామకం పొందిన అభ్యర్థులతో పాటు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టిజిపిఎస్సి)కి ఊరట లభించినట్టయింది. హైకోర్టు తీర్పును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) స్వాగతించారు. వాదనలు పూర్తయిన అనంతరం తుది తీర్పుకు రెండు వాయిదాలు తీసుకున్న ధర్మాసనం గురువారం తుదితీర్పును ప్రకటించింది. తుది తీర్పు గ్రూప్-1లో ఎంపికైన అభ్యర్థులకు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిజిపిఎస్ సి)కి అనుకూలంగా వచ్చింది.

Read Also: Supreme Court: 4 వారాల్లో రెగ్యులర్ డిజిపిని నియమించాలి

Group 1 judgement telangana: Relief for Group-1 candidates
Group 1 judgement telangana: Relief for Group-1 candidates

సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేసిన సిజె ధర్మాసనం

గత ఏడాది డిసెంబర్ 30న గ్రూప్-1 నియామకాలపై తుది వాదనలు జరిగిన విషయం తెలిసిందే. ఇరువాదనలు విన్న ధర్మాసనం.. తీర్పును ఈ ఏడాది జనవరి 22న వెలువరించనున్నట్టు ప్రకటించింది. జనవరి 22న తుది తీర్పును మరోసారి వాయిదా వేసి.. ఫిబ్రవరి 5న వెలువరించనున్నట్టు సీజే ధర్మాసనం ప్రకటించింది. కేసుకు సంబంధించిన తీర్పు కాపీ ఇంకా సిద్ధం కాలేదని న్యాయవాదులకు డివిజన్ బెంచ్ సమాచారం ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే తుది తీర్పును ఈ నెల 5న వెలువరించనున్నట్టు ప్రకటించింది. గ్రూప్-1 పరీక్షల నిర్వహణ, కరెక్షన్, బయోమెట్రిక్ నిబంధనల అమలులో లోపాలు ఉన్నాయంటూ పలువురు అభ్యర్థులు గతంలో హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్ బెంచ్, గ్రూప్-1 ఫలితాలను రద్దు చేస్తూ తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.

హైకోర్టు తీర్పును స్వాగతించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

జవాబు పత్రాలను తిరిగి మూల్యాంకనం చేయాలని, అవసరమైతే పరీక్షను మళ్లీ నిర్వహించాలని ఆదేశిస్తూ సింగిల్ బెంచ్ స్టే విధించిన విషయం తెలిసిందే. అనంతరం సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిజిపిఎస్ సి) తోపాటు గ్రూప్-1కి ఎంపికైన అభ్యర్థులు డివిజన్ బెంచ్లో అప్పీల్ చేశారు. ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం విచారణ జరిపి.. సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను ఎత్తివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నియామకాలు మాత్రం కోర్టు ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటాయని ధర్మాసనం స్పష్టం చేసింది. సింగిల్ బెంచ్ తీర్పుపై సీజే ధర్మాసనం స్టే విధించడంతో ప్రభుత్వం వేగంగా స్పందించి ఎంపికైన 562 మంది అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేసింది. ప్రస్తుతం గ్రూప్-1లో ఎంపికై నియామకాలు పొందిన వారు ఉద్యోగాలను కొనసాగిస్తున్నారు. తుది తీర్పు కోసం ఎదురు చూస్తున్న గ్రూప్-1 నియమిత అభ్యర్థులతోపాటు, టిజిపిఎస్సికి సీజీ ధర్మాసనం గురువారం ఇచ్చిన తుది తీర్పుతో భారీ ఊరట లభినట్టయింది.

గ్రూప్-1 నియామకాలపై హైకోర్టు వెలువరించిన తీర్పును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతించారు. గురువారం ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా హైకోర్టు తీర్పుపై స్పందించారు. ఎన్ని కుట్రలు పన్నినా న్యాయపోరాటంలో విజయం సాధించామని ట్వీట్లో పేర్కొన్నారు. ఉద్యోగాలకు ఎంపికైన 562 మంది గ్రూప్-1 అభ్యర్థులకు అభినందనలు తెలియజేశారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలి గ్రూప్-1 అధికారులైన మీరంతా రాష్ట్ర పునర్నిర్మాణానికి అంకితం కావాలని పిలుపునిచ్చారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.