తెలంగాణ (Telangana) రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు తీపి కబురు. రాష్ట్రంలో దాదాపు 14 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు డీజీపీ శివధర్‌రెడ్డి వెల్లడించారు. చాలా కాలంగా నోటిఫికేషన్ కోసం నిరీక్షిస్తున్న వేలాది మంది అభ్యర్థుల్లో ఈ ప్రకటన కొత్త ఆశలు చిగురింపజేసింది. మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో.. ‘తెలంగాణ నేర వార్షిక నివేదిక-2025’ను విడుదల చేసిన సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. డీజీపీ ప్రకటనతో త్వరలోనే నోటిఫికేషన్ వస్తుందని నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Telangana: మందుబాబులకు బంపర్ ఆఫర్?
ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇప్పటివరకు మూడు విడతలుగా (2016, 2018, 2022) పోలీసు నియామకాలు జరిగాయి. అయితే 2023 నుంచి రిక్రూట్‌మెంట్‌లో జాప్యం జరుగుతుండటంతో ప్రభుత్వంపై నిరుద్యోగులు ఒత్తిడి తెస్తున్నారు. లక్షలాది మంది అభ్యర్థులు వయోపరిమితి దాటిపోతుందన్న ఆందోళనలో ఉన్న తరుణంలో డీజీపీ ప్రకటన వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
శాఖలో ఏటా పదవీ విరమణలు చేస్తున్న వారి సంఖ్య పెరుగుతుండటం, కొత్తగా సిబ్బంది తోడవకపోవడంతో ప్రస్తుతం ఉన్న పోలీసులపై పనిభారం రెట్టింపైంది. ప్రతి రెండేళ్లకు ఒకసారి క్రమం తప్పకుండా నోటిఫికేషన్లు ఇస్తేనే సిబ్బంది సంఖ్య సమతుల్యంగా ఉంటుందని పోలీసు సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో సిబ్బంది కొరతను అధిగమించి, క్షేత్రస్థాయిలో పనితీరును మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: