📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Governor Shiva Pratap Shukla: యాదాద్రిలో గవర్నర్ దంపతులు

Author Icon By Rajitha
Updated: March 13, 2026 • 2:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం లో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా గురువారం కుటుంబ సభ్యులతో స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆలయానికి వచ్చిన ఆయనకు వేద పండితులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయ ప్రధాన అర్చకులు, వేద పండితులు ఆలయ సంప్రదాయంతో పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. గవర్నర్ ధ్వజస్తంభం వద్ద బలిపీఠానికి నమస్కరించుకొని స్వామి వారి అంతరాలయంలో అర్చనాది పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆయనకు ఆలయ అర్చకులు స్వామి అమ్మవారి అష్టోత్తరంతో ప్రత్యేక పూజలు గావించి హారతిని ఇచ్చి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.

Read also: Telangana: ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు ఉచిత రవాణా: సీఎం రేవంత్

Governor Shiva Pratap Shukla: The Governor and His Wife at Yadadri

శివాలయంలో అభిషేకం

అనంతరం ఆయనకు ఆలయ అర్చకులు వేద పండితుల సమక్షంలో ఘనంగా చతుర్వేద శ్లోకాలతో ఘనంగా ఆశీర్వచనాన్ని గావించారు. అనంతరం ఆయనకు కార్య నిర్వాహణాధికారి భవాని శంకర్ స్వామి అమ్మ వారిలో మెమొంటోను అందచేశారు. ఆలయ అనువంశిక ధర్మకర్త స్వామి వారి ప్రసాదాన్ని గవర్నర్ కు అందచేశారు. అనంతరం అనుబంధ దేవాలయం శ్రీ పర్వత వర్థిణి సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో స్పటిక లింగానికి గవర్నర్ దంపతులు పంచామృతాలతో అభిషేకం చేశారు. యాదగిరిగుట్టకు వచ్చిన రాష్ట్ర గవర్నర్ కు ప్రభుత్వ విప్, ఆలేరు శాసన సభ్యులు బీర్ల ఐలయ్య, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అక్షాంక్ష్ యాదవ్ రెవిన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి, రెవిన్యూ డివిజనల్ అధికారి కృష్ణా రెడ్డి గవర్నర్ కు పూల మొక్కలు బహుకరించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Governor Visit latest news Telangana temples Telugu News Yadadri News Yadagirigutta Updates

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.