ప్రైవేట్ పాఠశాలల్లో విచ్చలవిడిగా ఫీజుల పెంపును అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రైవేట్ స్కూళ్లు ఇష్టారీతిన ఫీజులు పెంచే అవకాశం లేదు. రెండు సంవత్సరాలకు కేవలం 8 శాతం మాత్రమే ఫీజులు పెంచుకునేలా ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీనికి సంబంధించిన కఠినమైన విధివిధానాలను రూపొందించే పనిలో విద్యాశాఖ నిమగ్నమైంది. తల్లిదండ్రులపై భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఈ నిబంధనలను ఉల్లంఘించే పాఠశాలలపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
Iran Defense Minister: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రి మృతి?
ఈ ప్రక్రియలో పారదర్శకతను పెంచేందుకు, ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 11,000 ప్రైవేట్ పాఠశాలల నుండి డేటాను సేకరించాలని నిర్ణయించింది. ఇందులో పాఠశాలల ప్రస్తుత ఫీజు వివరాలు, గత మూడు సంవత్సరాల ఆదాయ వ్యయాల లెక్కలు ఉంటాయి. సేకరించిన డేటాను విశ్లేషించిన తర్వాత, పాఠశాలల వారీగా ఫీజుల డ్రాఫ్ట్‌ను పబ్లిక్ డొమైన్‌లో ఉంచనున్నారు. ప్రజలు, తల్లిదండ్రుల నుండి సలహాలు, అభిప్రాయాలను సేకరించిన తర్వాతే ఫీజులను ప్రభుత్వం ఖరారు చేస్తుంది. ఈ చర్యల ద్వారా ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల విధానం పారదర్శకంగా మారుతుందని ఆశిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :