📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telangana: భూముల మార్కెట్ విలువ పెంపునకు సర్కార్ కసరత్తు

Author Icon By Anusha
Updated: August 15, 2025 • 11:19 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ముందుగా ఒఆర్ఆర్ లోపలి ప్రాంతంలోనే!

హైదరాబాద్ : తెలంగాణలో భూముల మార్కెట్ విలువను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ కోర్ ఆర్బన్ రీజియన్ పరిధిలో భూముల విలువలను పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారులకు సూచించారు. ప్రభుత్వ మార్కెట్ విలువలకు, బహిరంగ మార్కెట్లో ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించి ఆదాయం పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. త్వరలో మంత్రివర్గ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారు. తెలంగాణలో భూముల మార్కెట్ విలువలను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ మేరకు రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలపై సమీక్ష నిర్వహించి అధికారులకు సూచనలు చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ కోర్ ఆర్బన్ రీజియన్ (ఔటర్ రింగ్ రోడ్డు లోపల) పరిధిలో భూముల విలువలను పెంచాలని ప్రాథమికంగా నిర్ణయించారు.

కోర్ అర్బన్ పరిధిలోని వ్యవసాయ భూముల ప్రభుత్వ విలువ

ప్రభుత్వ మార్కెట్ విలువలకు, బహిరంగ మార్కెట్లో ఉన్న వాస్తవ విలువలకు మధ్య భారీ వ్యత్యాసం ఉండటమే పెంపుకు కారణంగా తెలుస్తోంది. కోర్ అర్బన్ పరిధి (Core urban area) లోని వ్యవసాయ భూముల ప్రభుత్వ విలువ ఎకరాకు రూ. 20 లక్షలు ఉండగా.. బహిరంగ మార్కెట్లో అదే భూమి రూ.10 నుంచి 20 కోట్లవరకు అమ్ముడవుతోంది. అదేవిధంగా గజం భూమి ప్రభుత్వ విలువ రూ.2 వేల2,500 ఉండగా, బయట మార్కెట్లో రూ.3050 వేల వరకు పలుకుతోంది. ఈ వ్యత్యాసాన్ని తగ్గించడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. భూముల విలువలను రెండు నుంచి మూడు రెట్లు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.అయితే, ఈ పెంపుపై రాబోయే మంత్రివర్గ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

Telangana

కలెక్టర్ల నుంచి నివేదికలు వచ్చిన తర్వాతే

ముందుగా కోర్ ఆర్బన్ రీజియన్ లో అమలు చేసి ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా దీనిని విస్తరించే అవకాశం ఉంది. ఈ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. కలెక్టర్ల నుంచి నివేదికలు వచ్చిన తర్వాతే దీనిపై ఒక స్పష్టత వస్తుంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా అన్ని భూములకు ఖిభూదారి నంబర్లను కేటాయించేందుకు ప్రణాళికలు రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. వారసత్వ, ఇతర మ్యుటేషన్ల దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని సూచించారు. లైసెన్స్డ్ సర్వేయర్లు చేసే భూ సర్వేలను రెగ్యులర్ సర్వేయర్లు తప్పనిసరిగా పరిశీలించాలని ఆదేశించారు. కోర్ ఆర్మన్ పరిధిలో కొత్తగా నిర్మించనున్న 10 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నమూనాలను సీఎం పరిశీలించారు. ఈ కార్యాలయాల్లో పార్కింగ్, క్యాంటీన్ వంటి మోలిక వసతులు ఉండేలా చూడాలని ఆదేశించారు.

రేవంత్ రెడ్డి ఏ కార్యక్రమంలో పాల్గొన్నారు?

2025 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఎగరవేశారు . స్వాతంత్ర్య దినోత్సవ ఘనత గురించి ప్రసంగించారు.

ఈ కార్యక్రమంలో ఎవరు పాల్గొన్నారు?

తెలంగాణ మంత్రులు, అధికారులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/minister-konda-surekha-779-74-crores-for-the-development-of-temples-in-the-state/telangana/530441/

Breaking News CM Revanth Reddy hyderabad Land value increase latest news Revenue Department telangana government Telangana land market Telugu News Urban core region

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.