📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News: Telangana-మరో రూ.35 వేల కోట్ల రుణం రిజర్వ్ బ్యాంక్ అనుమతి కోసం సర్కార్

Author Icon By Pooja
Updated: September 16, 2025 • 10:37 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రుణాలకు సంబంధించిన విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అభివృద్ధి పనుల్లో మరింత వేగం పెం చేందుకు రాష్ట్ర సర్కార్ సిద్ధమైంది. ఇందు కోసం రూ.35వేల కోట్ల మేర రుణాలను తీసుకోవాలని నిర్ణయించింది. ఈ రుణం నిమిత్తం రిజర్వ్ బ్యాంక్ (Reserve Bank)కు ప్రతిపాదనలు పెట్టి వాటికి అందుకు అనుమతి కోరింది.

రుణ వినియోగం

ఈ రుణంలో యంగ్ ఇండియా స్కూల్స్ కోసం 35వేల కోట్లు ఖర్చు చేయనుంది. వెయ్యి కోట్లను సాధారణ ఖర్చుల కోసం, మూసీ సుందరీకరణ కోసం 4వేల 100 కోట్లు కావాలని ఈ ప్రతిపాదనల్లో పేర్కొంది. అలాగే యంగ్ ఇండియా స్కూల్స్ కోసం 30వేల కోట్లు కావాలని ఆర్బీఐ దృష్టికి తీసుకెళ్లింది. ఈ కొత్త అప్పుతో ఇప్పటివరకు కాంగ్రెస్ సర్కార్ చేసిన అప్పు 2లక్షల 34వేల 500 కోట్లకు చేరింది. రేవంత్ సర్కార్ 21 నెలల్లోనే అప్పు ఇంతకు చేరుతోంది. జూలై 31 నాటికి, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రుణాలు రూ.24,669.88 కోట్లుగా ఉండగా, వార్షిక అంచనా బడ్జెట్లో మొత్తం రూ.54 వేల కోట్లు సేకరించనున్నట్లు పేర్కొంది.

ఆదాయ వనరులు తగ్గుముఖం

రోజు రోజుకు సర్కార్ ఖజానాకు ఆదాయం తగ్గుతూ వస్తోంది. రాష్ట్ర ఖజానాకు ప్రధాన ఆదాయ వనరులైన జీఎస్టీ, ల్యాండ్ రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, సేల్ టాక్స్, ఎక్సైజ్ ఆదాయం గడిచిన నాలుగు నెలల్లో పెరగకపోగా తగ్గుతూ వస్తుండటం సర్కార్కు మరింత గుదిబండగా మారింది. గతేడాది కంటే ఈ ఏడాది జీఎస్టీలో 3శాతం, సేల్స్ ట్యాక్స్ 2శాతం, స్టేట్ ఎక్సైజ్ పన్నులో 2.50 శాతం, ల్యాండ్ రెవెన్యూ ఆదాయం 2.3 శాతం తగ్గింది.

ఖజానా స్థితి

మరోవైపు అప్పులు మాత్రం ఈ నాలుగు నెలల్లో 45 శాతం రుణాలు చేసింది. ప్రస్తుత 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి జూలై వరకు నాలుగు నెలలకు రాష్ట్ర ఖజానాకు 74,955 కోట్ల రూపాయల మేర ఆదాయం(Income) సమకూరింది. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రుణాలు రూ.24,670 కోట్లు తీసుకుంది. ఇక రుణాల నిమిత్తం వడ్డీ చెల్లింపుల కింద రూ.9,355 కోట్లు ఖర్చు చేసింది.

ఖర్చుల విభజన

ప్రభుత్వం జూలై నాటికి రూ.68,823 కోట్లు లేదా వార్షిక కేటాయింపులో 26.1 శాతం ఖర్చు చేసింది. రెవెన్యూ వ్యయం ఒక్కటే రూ.62,835 కోట్లు ఖర్చయింది. జీతాలు, పెన్షన్లు, సబ్సిడీలు మరియు వడ్డీ చెల్లింపుల ద్వారా హూయి జరిగింది. రూ.36,504.45 కోట్ల వార్షిక లక్ష్యంలో 16.4 శాతం అంటే రూ.5,988 కోట్ల మాత్రమే ఉన్న పేలవమైన మూలధన వ్యయం ఆందోళనకరంగానే ఉంది. గత ఏడాది ఇదే కాలానికి 22.77 శాతంగా ఉన్న రాష్ట్రం, ఇప్పటివరకు రుణాలు మరియు అప్పులు వార్షిక రుణ పరిమితిలో 45.7 శాతానికి చేరుకున్నాయి. ఈ పరిస్థితుల్లో అభివృద్ధి పనుల కోసం మరో 35 వేల కోట్ల రూపాయల మేర రుణం చేయాల్సిన తప్పనిసరి పరిస్థితులు ఏర్పాడ్డాయి.

తెలంగాణ ప్రభుత్వం ఎంత రుణం తీసుకోవాలని నిర్ణయించింది?
రూ.35 వేల కోట్లు.

రుణంలో ఎక్కువ భాగం ఎక్కడ ఖర్చు చేయనున్నారు?
యంగ్ ఇండియా స్కూల్స్ కోసం రూ.30వేల కోట్లు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/ap-liquor-scam-another-supplementary-chargesheet-in-the-liquor-scam/andhra-pradesh/548033/

Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Reserve Bank Telangana Telangana Loans Telugu News Today TS Govt young india schoolS

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.