Telangana New Building Bylaws: తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాన్ని మరింత క్రమబద్ధీకరించే దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ముఖ్యంగా టీడీఆర్ (Transferable Development Rights) వినియోగం, హైరైజ్ (High-Rise) భవనాల వర్గీకరణలో తీసుకొచ్చిన ఈ మార్పులు భవిష్యత్తు నిర్మాణాలపై ప్రభావం చూపనున్నాయి.రాష్ట్రంలో పెరుగుతున్న పట్టణీకరణను దృష్టిలో ఉంచుకుని, భవన నిర్మాణ అనుమతుల్లో పారదర్శకత కోసం ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. దీనివల్ల రియల్టర్లకు కొన్ని వెసులుబాట్లు లభించినప్పటికీ, నిబంధనల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనుంది.
Read Also: Manjira River Illegal Sand Mining: మంజీర నదిలో ఇసుక దోపిడీ
Telangana New Building Bylaws: కొత్త నిబంధనలు ఇవే!
ఈ మేరకు 21 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న భవనాలను ఇకపై హైరైజ్‌గా పరిగణించనున్నట్లు స్పష్టం చేసింది. నిర్మాణ రంగంలో పారదర్శకత, క్రమబద్ధీకరణ లక్ష్యంగా ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది.కొత్త నిబంధనల ప్రకారం 2000 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న ప్లాట్లలో అదనపు అంతస్తుల నిర్మాణానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. 40 అడుగుల రోడ్డు వద్ద 3 అంతస్తులు, 60 అడుగుల రోడ్డు వద్ద 4, 80 అడుగుల రోడ్డు వద్ద 5 అదనపు అంతస్తుల నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. అయితే, 10 అంతస్తులు దాటిన భవనాలకు టీడీఆర్ వినియోగాన్ని తప్పనిసరి చేసింది. 20 అంతస్తులు దాటిన భవనాలకు 5 శాతం టీడీఆర్ లోడింగ్ కల్పించారు.

750 నుంచి 2000 చదరపు మీటర్ల ప్లాట్లలో నిర్మించే 18 నుంచి 21 మీటర్ల ఎత్తున్న భవనాలకు టీడీఆర్ వాడకాన్ని తప్పనిసరి చేశారు. నాన్ హైరైజ్ భవనాలకు టీడీఆర్ ద్వారా సెట్‌బ్యాక్‌లో సడలింపులు ఇవ్వగా, హైరైజ్ భవనాల్లో 10 శాతం వరకు సెట్‌బ్యాక్ రిలాక్సేషన్‌కు అనుమతించారు.భవన నిర్మాణ అనుమతి కోసం దరఖాస్తు చేసే సమయంలోనే 50 శాతం టీడీఆర్ సమర్పించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. మిగిలిన 50 శాతాన్ని ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీకి ముందు చెల్లించాల్సి ఉంటుందని తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: