తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అంశం మరోసారి వేడెక్కింది. తాజాగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన జీవో 9పై తెలంగాణ హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు.ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం (TG Govt) ఈ నిర్ణయాన్ని సవాలు చేయాలని నిర్ణయించింది.
Singareni : సింగరేణిలో 175 మంది అధికారులకు పదోన్నతులు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) నేతృత్వంలో జరిగిన కీలక సమావేశంలో, ఈ అంశాన్ని సుప్రీంకోర్టు ముందు ఉంచాలని నిర్ణయించబడింది. దీనికి అవసరమైన చట్టపరమైన చర్యలను తీసుకునేందుకు అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్‌లతో ప్రభుత్వం చర్చలు జరిపింది.
అభిషేక్ మను సింగ్వి, సిద్ధార్థ దవే వంటి రిజర్వేషన్లపై ప్రావీణ్యం కలిగిన అడ్వకేట్‌లతో వాదనలు వినిపించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.కాగా హైకోర్టు జీవో 9పై స్టే విధిస్తూ, 2 వారాల్లో పిటిషనర్లు కౌంటర్ దాఖలు చేయాలని, అలాగే 4 వారాల్లో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.
బీసీ రిజర్వేషన్ల పై హైకోర్టు ఆర్డర్ కాపీ వెలువడింది
తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. తాజాగా బీసీ రిజర్వేషన్ల పై హైకోర్టు ఆర్డర్ కాపీ వెలువడింది. ఈ కాపీ ప్రకారం జీఓ 9, 41, 42 ల పై హైకోర్టు (TG HighCourt)స్టే విధించింది. ట్రిపుల్ టెస్టు పాటించకపోవడం పై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సుప్రీం కోర్టు నిబంధనల ప్రకారం 50 శాతం రిజర్వేషన్లు మించి ఉండడాన్ని తప్పుబట్టింది.
తదుపరి విచారణ డిసెంబర్ 3 కు వాయిదా వేసింది. వికాస్ కృష్టా రావు గవాలి, రాహుల్ రమేష్ వాగ్ కేసుల్లో సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పులను హైకోర్టు పరిగణలోకి తీసుకున్నది.కాగా హైకోర్టు జీవో 9పై స్టే విధిస్తూ, 2 వారాల్లో పిటిషనర్లు కౌంటర్ దాఖలు చేయాలని, అలాగే 4 వారాల్లో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.
తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా
తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. తాజాగా బీసీ రిజర్వేషన్ల పై జీఓ 9, 41, 42 లపై హైకోర్టు ఆర్డర్ కాపీ వెలువడింది. అందులో ట్రిపుల్ టెస్టు పాటించకపోవడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది.
సుప్రీం కోర్టు నిబంధనల ప్రకారం.. 50 శాతం రిజర్వేషన్లు పరిమితి మించరాదని స్పష్టం చేసింది. తదుపరి విచారణ డిసెంబర్ 3 కు వాయిదా వేసింది. వికాస్ కృష్టారావు గవాలి, రాహుల్ రమేష్ వాగ్ కేసుల్లో ధర్మాసనం తీర్పులను హైకోర్టు పరిగణలోకి తీసుకున్న విషయం తెలిసిందే.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: