తెలంగాణ ప్రభుత్వం 2027లో జరగనున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన గోదావరి పుష్కరాల కోసం భారీ సన్నద్ధతను ప్రకటిస్తూ నేటి రాష్ట్ర బడ్జెట్‌లో రూ. 500 కోట్లను ప్రతిపాదించింది. 2027 జూన్ 26 నుండి జూలై 7 వరకు 12 రోజుల పాటు ఈ పుష్కరాలు వైభవంగా జరగనున్నాయి. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ఈ పుష్కరాలను కేవలం ఒక పండుగలా కాకుండా ‘కుంభమేళా’ స్థాయిలో అత్యంత వైభవంగా నిర్వహించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మౌలిక సదుపాయాల కల్పన కోసం ఈ నిధులను వెచ్చించనున్నారు.
Read Also : Garikapati Mid Day Meal Comments: గరికపాటి మధ్యాహ్న భోజనం వ్యాఖ్యలపై క్లారిటీ!
ఈ నిధులతో రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన భద్రాచలం, కాళేశ్వరం, ధర్మపురి, బాసర, కందకుర్తి వంటి తీర ప్రాంతాల్లో భక్తులకు అవసరమైన ఘాట్ల నిర్మాణం, రవాణా సౌకర్యాలు, తాగునీరు మరియు పారిశుద్ధ్య పనులను చేపట్టనున్నారు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి త్రివేణి సంగమం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. పుష్కరాలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా ప్రభుత్వం ఇప్పుడే కార్యాచరణను సిద్ధం చేస్తోంది. గోదావరి నది ప్రవహించే జిల్లాల్లో పర్యాటక రంగాన్ని కూడా దీని ద్వారా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :