📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

గ్రూప్స్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ తెలిపిన తెలంగాణ సర్కార్

Author Icon By Sudheer
Updated: February 12, 2025 • 11:16 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణలో గ్రూప్-1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు సంబంధించి టీఎస్‌పీఎస్సీ (TSPSC) కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీ కోసం గతంలో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మెయిన్స్ పరీక్షలు 2023 అక్టోబర్ 21 నుండి 27 వరకు నిర్వహించగా, 21,093 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన 31,383 మంది అభ్యర్థుల్లో 67.17% మాత్రమే మెయిన్స్ రాశారు.

ఈ గణాంకాల ప్రకారం, ఒక్కో పోస్టుకు సుమారు 38 మంది పోటీ పడుతున్నారు. తాజాగా, గ్రూప్-1 మెయిన్స్ జవాబు మూల్యాంకనం పూర్తయిందని టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. అభ్యర్థులు మెయిన్స్‌లో సాధించిన మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా రూపొందించేందుకు తుది సమీక్ష జరుగుతోంది.

ఈ సమీక్ష పూర్తయిన వెంటనే వారం నుంచి 10 రోజుల్లో గ్రూప్-1 ఫలితాలు విడుదల చేయనున్నట్లు సమాచారం. మెరిట్ జాబితాలో ఎంపికైన అభ్యర్థులకు ధృవపత్రాల పరిశీలన అనంతరం తుది ఎంపిక జాబితాను ప్రకటించనున్నారు. దీని ద్వారా అభ్యర్థులకు తుది నియామక ప్రక్రియ మరింత త్వరగా పూర్తి కానుంది. గ్రూప్-1 నియామక ప్రక్రియ పూర్తయిన తర్వాతే గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షల ఫలితాలను ప్రకటించనున్నట్లు సమాచారం. ఇది ఆయా పరీక్షలు రాసిన అభ్యర్థులకు కూడా సానుకూల సంకేతంగా మారింది. టీఎస్‌పీఎస్సీ తాజా ప్రకటనతో గ్రూప్-1 అభ్యర్థులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే తుది ఫలితాలు వెల్లడవుతాయని, అభ్యర్థులు తగిన పత్రాలను సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Google news group 2 Telangana

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.