తెలంగాణ Telangana పత్తి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మంచి వార్త అందించింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు Tummala Nageswara Rao ప్రకటించిన ప్రకారం, రాబోయే వారం రోజుల్లోనే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) ద్వారా పత్తి కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. తన నివాసంలో పత్తి కొనుగోలు ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించిన తుమ్మల, ఈ సీజన్‌లో కొనుగోళ్లు ఆలస్యమవుతున్నందుకు కారణాలు పరిశీలించారు.
Heart Attack:లండన్ లో గుండెపోటుతో జగిత్యాల విద్యార్థి మృతి
Telangana
సీసీఐ, మిల్లర్లతో మళ్లీ సమావేశం
మంత్రి తెలిపారు అక్టోబర్ 6న సీసీఐ సీఎండీతో పాటు కాటన్ మిల్లర్ల సంఘ ప్రతినిధులతో మరోసారి సమావేశం జరుగనుంది. జిన్నింగ్ మిల్లులు టెండర్లలో పాల్గొనకపోవడం వల్ల ఏర్పడిన ఇబ్బందులను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. సచివాలయంలో రెండు దఫాలు సీసీఐ CCI అధికారులు, మిల్లర్లతో చర్చించినట్లు కూడా వివరించారు తాజాగా కురిసిన అధిక వర్షాల కారణంగా పత్తి దిగుబడి తగ్గిందని మంత్రి తెలిపారు. ఈ పరిస్థితుల్లో రైతులప్రయోజనాలకు విరుద్ధంగా ఎవరు ప్రవర్తించినా వారిని కఠినంగా ఎదుర్కొంటామని హెచ్చరించారు. “ఏ పరిస్థితుల్లోనైనా రాబోయే వారంలో పత్తి కొనుగోళ్లు మొదలవుతాయి” అని స్పష్టం చేశారు.
గత సీజన్ విధానాలు కొనసాగింపు
గత సంవత్సరం అమల్లో ఉన్న పత్తి కొనుగోలు విధానాలను ఈ సీజన్‌లో కూడా కొనసాగించాలని మంత్రి సూచించారు. లింట్ శాతం, స్లాట్ బుకింగ్ ఏరియా మ్యాపింగ్ వంటి సాంకేతిక అంశాలపై వచ్చిన అభ్యంతరాలను సీసీఐ అధికారులు సమీక్షించి, అవసరమైతే కొంత సడలింపులు ఇస్తామని హామీ ఇచ్చారు.
పత్తి రైతులకు సంబంధించిన శుభవార్త ఏమిటి?
రాబోయే వారం రోజుల్లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) ద్వారా పత్తి కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు.
సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లు ఎప్పుడు ప్రారంభమవుతాయి?
రాబోయే వారంలోపే పత్తి కొనుగోళ్లు ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: