📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్

Telangana: వైద్య విధాన పరిషత్లో జీతాలు రాని ప్రభుత్వ వైద్యులు

Author Icon By Tejaswini Y
Updated: December 26, 2025 • 11:22 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ : రాష్ట్రంలోని వైద్య విధాన పరిషత్(టివివిపి)లో పనిచేస్తున్న ప్రభుత్వ వైద్యులకు 26వ తేది వచ్చినా జీతాలు అందలేదు. గత కొంతకాలంగా ఇలాగే టివివిపిలో వచేస్తున్న వైద్యులు జీతాలు కోసం నెలల తరబడి. ఎదురుచూడాల్సి వస్తోందని.. వెంటనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని తెలంగాణ(Telangana) ప్రభుత్వ వైద్యుల సంఘం(TGGDA) డిమాండ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నప్పటికీ .. ఇప్పటి వరకు సమస్యను పరిష్కరించ లేదని సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ నరహరి బావన్వల్లి, సెక్రటరీ జనరల్ డాక్టర్ లాలు ప్రసాద్ రాథోడన, ట్రెజరర్ డాక్టర్ ఎంకె రౌఫ్ విమర్శించారు. వెంటనే సమస్యను పరిష్కరించకపోతే తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరించారు.

Read Also: Ranga Reddy: శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా

Telangana: Government doctors who have not received salaries in the Medical Policy Council

తెలంగాణ ప్రభుత్వ వైద్యులు

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే వేలాది తెలంగాణ ప్రభుత్వ వైద్యులు ఎంతో ఆశతో స్వాగతం వలికారని, రెండు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న మార్పు తప్పక వస్తుందని, తెలంగాణ వైద్య విధాన పరిషత్ (TVVP) పరిధిలో పనిచేస్తున్న వైద్యులకు శాశ్వత జీతాల పరిష్కారం లభిస్తుందని భావించినప్పటికీ, నేటికీ పరిస్థితి మరింత దయనీయంగా మారిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. టివివిపి పరిధిలో పనిచేస్తున్న వందలాది ప్రభుత్వ వైద్యులు ప్రతి నెల జీతాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి కొనసాగుతోందని, 26వ తేది వచ్చినా కూడా జీతాలు విడుదల కాకపోవడం వల్ల తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

టిజిజిడిఏ డిమాండ్

టివివిపిని డైరెక్టరేట్ పరిధిలోకి తీసుకురావడమే దీనికి శాశ్వత పరిష్కారమని టివివిపిని కార్పొరేషన్ వ్యవస్థ నుంచి బయటకు తీసి డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్ పరిధిలోకి తీసుకురావడమే జీతాల సమస్యకు శాశ్వత పరిష్కారమని టిజిజిడిఏ స్పష్టం చేసింది. ఈ అంశంపై సంబంధిత అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినప్పటికీ, ఇప్పటివరకు స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడం బాధాకరమన్నారు. టివివిపి వైద్యుల జీతాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలంటే ప్రభుత్వం తక్షణమే అసెంబ్లీలో బిల్ ప్రవేశపెట్టి, స్పష్టమైన చట్టబద్ధ వ్యవస్థను తీసుకురావాలని టిజిజిడిఏ డిమాండ్ చేసింది. బిల్లును ఆలస్యం చేయడమంటే వేలాది ప్రభుత్వ వైద్యులను అనిశ్చితిలోకి నెట్టడమేనని టిజిజిడిఏ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా బాధ్యతగా స్పందించి, టివివిపి వైద్యులకు ప్రతి నెల మొదటి తేదీన జీతాలు వచ్చేలా శాశ్వత వ్యవస్థ ఏర్పాటు చేయాలని, లేనిపక్షంలో తదుపరి కార్యాచరణకు టిజిజిడిఏ సిద్ధంగా ఉందని నాయకులు స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

government doctors salary delay Telangana government doctors Telangana Health Department TGJDA protest TVVP doctors salaries TVVP salary issue

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.