हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Latest News: TG GOVT: జాయింట్ కలెక్టర్ పోస్టు రద్దు చేసిన తెలంగాణ ప్ర‌భుత్వం

Aanusha
Latest News: TG GOVT: జాయింట్ కలెక్టర్ పోస్టు రద్దు చేసిన తెలంగాణ ప్ర‌భుత్వం

తెలంగాణలో పరిపాలనా వ్యవస్థలో మరో కీలక సంస్కరణ చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) నేతృత్వంలోని ప్రభుత్వం అటవీ భూములకు సంబంధించిన వివాదాలను వేగంగా, పారదర్శకంగా పరిష్కరించే దిశగా నిర్ణయాత్మక అడుగు వేసింది. గతంలో అటవీ భూవివాదాలకు సంబందించిన వ్యవహారాల్లో జాయింట్ కలెక్టర్ బాధ్యతలు నిర్వర్తించేవారు.

Debt Survey: ఆంధ్రా-తెలంగాణ అప్పుల సంక్షోభం

అయితే ఈ వ్యవస్థలో ఆలస్యం, స్పష్టత లేమి, పరిపాలనా సమన్వయంలో సమస్యలు ఉన్నాయని ప్రభుత్వం (TG GOVT) గుర్తించింది.నిమిత్తం జాయింట్ కలెక్టర్ (Joint Collector) పోస్టును రద్దు చేసి, ఇకపై జిల్లా అదనపు కలెక్టర్లను ఫారెస్ట్ సెటిల్‌మెంట్ ఆఫీసర్లుగా (FSO) నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లకు ఈ నూతన బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

1967 అటవీ చట్టం, 1927 నాటి చట్టాల ప్రకారం అదనపు కలెక్టర్లకు ఈ నియామకాలు చేపట్టినట్లు ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మార్పుతో పాలనలో జవాబుదారీతనం పెరిగి, అటవీ భూముల సమస్యలు త్వరితగతిన పరిష్కారమవుతాయని భావిస్తోంది. ఫారెస్ట్ సెటిల్‌మెంట్ ఆఫీసర్లుగా అదనపు కలెక్టర్లు అటవీ భూముల హక్కులను నిర్ధారించడం, అటవీ ప్రాంతాల సరిహద్దులను గుర్తించడం వంటి కీలక విధులు నిర్వర్తిస్తారు.

TG GOVT
TG GOVT

భూ సర్వే, హక్కుల నిర్ధారణ, సెటిల్‌మెంట్ ప్రక్రియలను పూర్తి చేయడం వీరి బాధ్యత.ఈ కొత్త అధికారాల కింద, అటవీ భూములకు సంబంధించిన రికార్డులను సమగ్రంగా పరిశీలించడం, అవకతవకలపై విచారణ జరపడం, చట్టపరమైన ప్రకటనలు జారీ చేయడం వంటివి చేస్తారు. విధి నిర్వహణలో భాగంగా అటవీ ప్రాంతంలోకి ప్రవేశించే అధికారం కూడా వీరికి ఉంటుంది.

ఈ మొత్తం ప్రక్రియను ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ పర్యవేక్షిస్తారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ అధికారులకు సూచనలు అందాయి.అయితే, ఈ కొత్త అటవీ బాధ్యతలతో పాటు అదనపు కలెక్టర్లు తమ సాధారణ పరిపాలనా విధులను కూడా యధావిధిగా కొనసాగించాల్సి ఉంటుంది.

జిల్లా కలెక్టర్‌కు సహాయకులుగా రెవెన్యూ, భూ కేటాయింపులు, పౌర సరఫరాలు, భూభారతి వంటి అంశాలను పర్యవేక్షించడంతో పాటు స్థానిక సంస్థలైన గ్రామ పంచాయతీలు, పురపాలక సంఘాల అభివృద్ధి ప్రణాళికలను కూడా వీరే చూస్తారు. పచ్చదనం, పరిశుభ్రత వంటి ప్రత్యేక కార్యక్రమాల అమలు, ప్రభుత్వ పథకాల పర్యవేక్షణ వీరి విధుల్లో భాగంగా ఉంటాయి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870