📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Telangana: ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ కిట్ల కోసం రూ. 200 కోట్లు కేటాయింపు

Author Icon By Aanusha
Updated: March 14, 2026 • 7:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Telangana: రాష్ట్రంలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు మార్చి 12న జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆదేశాలు జారీ చేశారు.

తప్పనిసరి ఈవీలు: ఇకపై అన్ని ప్రభుత్వ శాఖలు కొనుగోలు చేసే కొత్త వాహనాలు కేవలం ఎలక్ట్రిక్ వాహనాలే (EVs) అయి ఉండాలి.

అద్దె వాహనాలు కూడా: హైదరాబాద్ లోని కోర్ అర్బన్ రీజియన్ (CURE) పరిధిలో ప్రభుత్వ అవసరాల కోసం అద్దెకు తీసుకునే వాహనాలు కూడా ఈవీలే అయి ఉండాలని స్పష్టం చేశారు.

Read Also: Armoor Road Accident: ఆటో – స్కూటీ ఢీ.. ఇద్ద‌రు యువ‌కులు స్పాట్ డెడ్

హైదరాబాద్ ఓఆర్ఆర్ పరిధిలోని ఆటోల విషయంలో ప్రభుత్వం కీలక ప్రతిపాదనలు సిద్దం చేసింది. పెట్రోలు, డీజిల్​ తో పనిచేసే ఆటోరిక్షాలను ఎలక్ట్రిక్‌ కిట్లతో రెట్రోఫిట్‌ చేసేందుకు ఆటో యజమానులకు 100 శాతం ఆర్థిక సహాయాన్ని అందించేవిధంగా చర్యలు చేపట్టాలని సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. 2026-27 బడ్జెట్‌లో ఇందుకోసం రూ.200 కోట్లు కేటాయించాలని ఆదేశించారు. అయితే పెట్రోల్, డీజిల్ ఆటోలకు ఎలక్ట్రిక్ కిట్లను అమర్చేందుకు ఆటో యజమానులకు 100 శాతం ఆర్థిక సాయం అందించాలని సీఎం రేవంత్ అధికారులకు సూచనలు చేశారు.

Telangana: Good news for auto drivers.. Rs. 200 crore allocated for electric kits

ఆటోడ్రైవర్లపై ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు సంక్షేమ శాఖల సబ్‌ ప్లాన్‌ల నుంచి నిధులను సబ్సిడీ ద్వారా అందించాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. ఆటోలకు ఈ-కిట్లు అమర్చేందుకు సుమారు లక్షా ఇరవై వేల నుంచి రెండు లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని రవాణాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.ఆటోలకు ఎలక్ట్రిక్‌ కిట్లు పెట్టేందుకు దాదాపు రూ.1.20 లక్షల నుంచి రూ.2 లక్షల దాకా ఖర్చవుతుందని రవాణాశాఖ అధికారులు తెలిపారు. ఇదిలాఉండగా ORR పరిధిలో ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులే నడిపిస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఈ మార్పుతో ఆటోల కారణంగా వెలువడే శబ్ద, వాయు కాలుష్యాలు తగ్గుతాయి.

మరికొద్ది రోజుల్లో మరో 150 ఎలక్ట్రిక్‌ బస్సులు రానున్నాయి

ఇదే కాకుండా ఆటో డ్రైవర్లకూ నిర్వహణ ఖర్చులు తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఆటోలకు ఏర్పాటు చేసే ఈ విధానం ద్వారా సుమారు రూ.1.20 లక్షలు అవుతుంది. ఫిక్స్‌డ్‌ బ్యాటరీ సిస్టమ్​ అయితే సుమారు రూ.2 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో మరో 150 ఎలక్ట్రిక్‌ బస్సులు రానున్న క్రమంలో కర్బన ఉద్గారాల స్థాయి భారీగా తగ్గనున్నట్లుగా తెలుస్తోంది. రెండు సంవత్సరాల్లో మరో 2,500 రోడ్డెక్కించనున్నట్టు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించటంతో త్వరలో పూర్తి స్థాయిలో ఈవీ బస్సులు నగరంలో ప్రయాణీకులకు అందుబాటులోకి రానున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Auto Drivers ORR Telangana

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.