📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Telangana: గ్రామ పంచాయతీలకు కేంద్రం నుంచి నిధులు విడుదల

Author Icon By Saritha
Updated: February 12, 2026 • 4:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రెండో విడత 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేసింది. (Telangana) తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఆలస్యం కావడంతో 15వ ఆర్థిక సంఘం నిధులు పెండింగ్‌లో ఉండగా ఇప్పుడు అవి విడుదల అవుతున్నాయి. ఎట్టకేలకు రేవంత్ రెడ్డి (Revanth Reddy) నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం 3 విడతలుగా రాష్ట్రంలోని 10 వేలకు పైగా గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించింది. విజయవంతంగా ఎన్నికలు పూర్తి చేసుకుని తెలంగాణ గ్రామాల్లో కొత్త పాలక వర్గాలు ఏర్పాటు అయ్యాయి.

Read Also: Sammakka Saralamma Jatara: పూర్తైన మేడారం హుండీల లెక్కింపు..

Funds released from the Center for Gram Panchayats

మొత్తంగా రూ. 646.36 కోట్ల నిధులు విడుదల

దీంతో ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న 15వ ఆర్థిక సంఘం నిధులు విడతల వారీగా విడుదల అవుతున్నాయి. ఇందులో భాగంగానే తొలి విడత కింద ఇటీవల తెలంగాణ పంచాయతీలకు రూ.259.36 కోట్లను మోదీ సర్కార్ విడుదల చేసింది. (Telangana) తాజాగా రెండో విడత నిధులను కూడా రిలీజ్ చేసింది. రెండో విడతలో భాగంగా రూ.387 కోట్లని అందించింది. దీంతో రెండు విడతల్లో కలిపి మొత్తంగా రూ. 646.36 కోట్ల నిధులు విడుదల అయ్యాయి.

ఈ నిధులతో, గ్రామపంచాయతీల్లో పెండింగ్‌లో ఉన్న పనులకు, మౌలిక సదుపాయాల కల్పనకు ఊతం లభించనుంది. కేంద్రం నుంచి గ్రామ పంచాయతీలకు మరో రూ.2,400 కోట్ల నిధులు రావాల్సి ఉంది. గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడకుండా ఉండటానికి పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ మంత్రి సీతక్క కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో కేంద్రం నుంచి విడతలుగా నిధులు వస్తున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:


15th Finance Commission central government funds Latest News in Telugu panchayat elections Revanth Reddy sarpanch elections Telangana Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.