Telangana Funds: 15వ ఆర్థిక సంఘం కింద తెలంగాణకు రావాల్సిన నిధుల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం తాజాగా ₹387 కోట్లను విడుదల చేసింది. ఈ మొత్తాన్ని గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి పనులు, పెండింగ్ బిల్లుల చెల్లింపులకు వినియోగించాలని కేంద్రం రాష్ట్రానికి సూచించింది.
Read Also:Revanth Reddy: కేంద్రంలో ఏఐ మంత్రిత్వ శాఖ ఉండాలి
పంచాయతీ ఎన్నికలు పూర్తైన నేపథ్యంలో విడతల వారీగా నిధులు విడుదల చేస్తున్నట్లు కేంద్ర అధికారులు తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రానికి మొత్తం ₹1034.42 కోట్ల వరకు అందినట్లు సమాచారం. ఇంకా సుమారు ₹2000 కోట్ల వరకు రావాల్సి ఉండగా, వాటిని త్వరితగతిన విడుదల చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ మంత్రి సీతక్క కేంద్రాన్ని కోరారు.
గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సరఫరా, పారిశుధ్య పనులు, పంచాయతీ భవనాల నిర్మాణం వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ నిధులు కీలకంగా ఉపయోగపడనున్నాయి. అలాగే గ్రామ పంచాయతీలకు పెండింగ్‌లో ఉన్న కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపులకు కూడా ఈ మొత్తాన్ని వినియోగించనున్నారు. రాష్ట్రంలో గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడానికి కేంద్రం నుంచి మిగిలిన నిధులు కూడా త్వరగా విడుదల కావాలని ప్రభుత్వం ఆశిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: