📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్

Latest News: Telangana: ఇందిరా గాంధీ జయంతి రోజు ఉచిత చీరల పంపిణీ

Author Icon By Aanusha
Updated: October 13, 2025 • 6:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ (Telangana) లో బతుకమ్మ పండుగ (Bathukamma Festival) సందర్భంగా రాష్ట్ర మహిళలకు ఉచితంగా చీరలు పంపిణీ చేయాలన్న వార్త అందరికీ తెలిసిన అంశం. ఈ కార్యక్రమాన్ని “ఇందిరా మహిళా శక్తి” పేరుతో నిర్వహించాలని ప్రణాళిక వేయబడింది. అయితే ప్రారంభంలో కొన్ని సాంకేతిక, లాజిస్టికల్ కారణాల వల్ల చీరల పంపిణీ (Distribution of sarees) ని వాయిదా వేయడం జరిగింది.

Read Also: Natural disasters: ప్రకృతి వైపరీత్యాలే ప్రపంచ సవాళ్లు

పండుగ సందర్భంగా కార్యక్రమం సజావుగా నిర్వహించడంలో అవాంతరాలు ఎదురైనందున, రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పండుగ తర్వాత చేపట్టాలని నిర్ణయించింది.ఈ వాయిదా తర్వాత, చీరల పంపిణీని ప్రత్యేక సందర్భంగా, దివంగత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ జయంతి (Indira Gandhi Jayanti) (నవంబర్ 19) రోజున ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం మహిళలపై ప్రత్యేక శ్రద్ధను చూపించేలా, రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశించింది.

పంపిణీ కార్యక్రమం కోసం అన్ని ఏర్పాట్లు ఇప్పటికే చేపట్టబడుతున్నాయి. జిల్లా, మున్సిపల్, గ్రామ స్థాయిలో వివిధ అధికార సంస్థలతో సమన్వయం కొనసాగుతోంది.రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 18,848 స్వయం సహాయకం బృందాల్లో (ఎస్‌హెచ్‌జీ).. 1.94లక్షల మంది సభ్యులు ఉన్నారు.

Telangana

అన్ని ఏర్పాట్లు ఇప్పటికే చేపట్టబడుతున్నాయి

ఈ గ్రూపుల్లో ఉన్న వారందరికీ.. ఒక్కో చీర (Saree) చొప్పున ప్రభుత్వం పంపిణీ చేయనుంది. అంటే మొత్తం 1.94 లక్షల చీరలు అవసరం అవుతాయన్నమాట. అయితే ఇందులో జిల్లాలకు 50 శాతం చీరలు మాత్రమే సరఫరా అయ్యాయి. వాటిని గోదాముల్లో భద్రపరిచారు. మిగతా 50 శాతం చీరలు త్వరలో జిల్లాలకు సరఫరా కానున్నాయి.

సెర్ప్‌, మెప్మా వంటి మహిళా సంఘాలకు నాయకత్వం వహించే సంస్థలు ఈ ఉచిత చీరలను పంపిణీ చేయనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో సెర్ప్‌ (Serp) ఆధ్వర్యంలో.. అర్బన్ ప్రాంతాల్లో మెప్మా ఆధ్వర్యంలో మహిళలకు చీరలు అందించనున్నారు.

రెండు రకాలుగా ఈ చీరలను అందించనున్నారు

రెండు రకాలుగా ఈ చీరలను అందించనున్నారు. యవ, మధ్య వయస్కులకు 6.5 మీటర్లు, వృద్ధుల కోసం 9 మీటర్ల చీరలను పంపిణీ చేయనున్నారు. కాగా, చీరల నాణ్యత విషయంలో ఆరోపణలకు అవకాశం లేకుండా.. సిరిసిల్ల, కరీంనగర్‌, వరంగల్‌ ప్రాంతాల్లో మగ్గాలపై తయారు చేయించి.. పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. ఒక్కోటి రూ. 800 విలువ గల చీరలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Breaking News free sarees distribution Indira Mahila Shakti latest news Telangana Bathukamma Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.