వన్యప్రాణి సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. తెలంగాణ(Telangana)లోని అభయారణ్యాల్లో పెద్దపులులు, ఎలుగుబంట్లు, చిరుతలు, వన్యప్రాణుల సంరక్షణకు ఆధునిక సాంకేతికతను వినియోగించేందుకు అటవీశాఖ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రయోగాత్మకంగా అమ్రాబాద్ టైగర్ రిజర్వులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత స్మార్ట్ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇవి వన్యప్రాణుల సంచారాన్ని(కదలికలను) నిరంతరం పర్యవేక్షించేందుకు, డిజిటల్ పెట్రోలింగ్‌కు(గస్తీ) ఉపయోగపడతాయి.
Read Also: Revanth Reddy: ‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని సిద్ధం చేయాలి
పచ్చదనం పెంపు..
అడవిలో వేటగాళ్ల సంచారాన్ని వెంటనే గుర్తించి అటవీశాఖ అధికార యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసేందుకు ఈ ఏఐ స్మార్ట్కెమెరాలు ఉపయోగపడతాయి. ఈ సాంకేతికత దేశంలోని పలు టైగర్ రిజర్వుల్లో ఇప్పటికే అందుబాటులోకి ఉంది. ఉత్తరాఖండ్‌లోని జిమ్‌కార్బెట్ నేషనల్ పార్క్(పులులకు ప్రసిద్ధి), అసోంలోని కజిరంగా నేషనల్ పార్క్, కర్ణాటకలోని బందీపుర్ టైగర్ రిజర్వు, మధ్యప్రదేశ్‌లోని కన్హా టైగర్‌రిజర్వు తదితర చోట్ల ఈ తరహా కెమెరాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వులు ఉండగా తొలుత అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌పై అటవీశాఖ దృష్టిసారించింది. ఈ అటవీ ప్రాంతంలో ప్రస్తుతం సాధారణ కెమెరాలు మాత్రమే ఉన్నాయి. పచ్చదనం పెంపు, పర్యావరణ పరిరక్షణలో భాగంగా 2047 సంవత్సరం నాటికి రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: