📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

News telugu: Telangana: ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై స్పందించని ప్రభుత్వం.. కాలేజీలు బంద్‌కు సిద్ధం

Author Icon By Sharanya
Updated: September 14, 2025 • 5:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ (Fee reimbursement)బకాయిల చెల్లింపుపై ఉద్రిక్తత పెరుగుతోంది. బకాయిలు చెల్లించాలని కోరుతూ ఆందోళన బాట పట్టిన ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అంచనాకు మించిన స్పందన లభించింది. “ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉంది, బకాయిల చెల్లింపులకు ఒక్క పైసా కూడా లేదు” అని రాష్ట్ర ఆర్థిక మంత్రి మరియు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేయడం యాజమాన్యాల్ని ఆశ్చర్యానికి గురి చేసింది.

News telugu

రూ.3,500 కోట్లు బకాయి – కనీసం రూ.1,200 కోట్లు ఇప్పుడైనా ఇవ్వండి

శనివారం భట్టి విక్రమార్కను కలిసి ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల ప్రతినిధులు తమ డిమాండ్లు ఉంచారు. మొత్తం బకాయిలు రూ.3,500 కోట్లు ఉన్నాయని పేర్కొంటూ, కనీసం టోకెన్లు జారీ అయిన రూ.1,200 కోట్లను తక్షణమే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆ మొత్తాన్ని ఇచ్చినట్లయితే సోమవారం నుంచి ప్రారంభించబోయే కాలేజీల బంద్‌ను ఉపసంహరించుకుంటామని ప్రకటించారు.

“పైసా లేదు.. నేనేం చేయలేను”: భట్టి నిస్సహాయత

విజ్ఞప్తికి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) స్పందిస్తూ, ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని ఉద్యోగుల జీతాలు, సంక్షేమ పథకాలకు ఖర్చు చేస్తున్నామని, ఖజానాలో అదనంగా డబ్బు మిగలడంలేదని చెప్పారు. “రీయింబర్స్‌మెంట్ చెల్లింపుపై నేను ఏమీ చేయలేను. ఇవ్వడానికి పైసా కూడా లేదు. ఇంకేం చేయమంటారో మీరే చెప్పండి” అని ఆయన వ్యాఖ్యానించినట్టు సమాచారం. దీంతో కళాశాలల ప్రతినిధులు తీవ్రంగా నిరాశ చెందినట్టు తెలుస్తోంది.

మరోవైపు భిన్నమైన హామీలు – బంద్‌పై అంతిమ నిర్ణయం త్వరలో

తర్వాత, ప్రతినిధులు మంత్రులు శ్రీధర్‌బాబు మరియు ప్రభుత్వ సలహాదారు వేంకట నరేందర్ రెడ్డిని వేర్వేరుగా కలిశారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ, విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూసుకుంటామని, సమస్యను దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
వేంకట నరేందర్ రెడ్డి కూడా, బకాయిలను విడతలవారీగా చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.

ఫైనల్ నిర్ణయం కోసం మాసబ్‌ట్యాంక్‌లో సమావేశం

ప్రభుత్వం నుంచి వచ్చిన వివిధ విధాలుగా స్పందనల నేపథ్యంలో, ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు తమ తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు సిద్ధమయ్యాయి.
ఈ రోజు మాసబ్‌ట్యాంక్‌లోని ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో సమావేశమై, మంత్రులతో జరిగిన చర్చలపై విశ్లేషణ చేసి, బంద్‌పై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ విషయాన్ని కళాశాలల సమాఖ్య నాయకులు ఎన్. రమేశ్ బాబు, కేఎస్. రవికుమార్, కె. సునీల్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

Read hindi news hindi.vaartha.com

Read also

https://vaartha.com/8-days-in-jail-for-throwing-garbage-on-the-road/breaking-news/547129/

bhatti vikramarka Breaking News latest news Private colleges bandh Student Issues Telangana education news Telangana Fee Reimbursement Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.