📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్

Telangana: రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్

Author Icon By Tejaswini Y
Updated: December 26, 2025 • 10:57 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ : తెలంగాణ(Telangana)లో రైతు భరోసా పథకంపై రేవంత్(Revanth Reddy) సర్కార్ కీలక నిర్ణయం వల్ల సుమారు 15 లక్షలకు పైగా ఎకరాలకు నిధులు కట్ అయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపధ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 1.20 కోట్ల ఎకరాలకు మాత్రమే రైతు భరోసా పరిమితమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ యాసంగి నుండి రైతు భరోసా నిధుల విడుదలలో భాగంగా పంటలు వేసిన భూములకు మాత్రమే పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 70.11 లక్షల మంది రైతులకు చెందిన కోటి 49 లక్షల ఎకరాలకు రైతు భరోసా(Rythu Bharosa Scheme) అందిస్తున్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలో కొత్తగా పంట భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకు రైతు భరోసా నిమిత్తం దరఖాస్తు చేసుకునే వీలు కల్పించడంతో దాదాపు 5 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి.

Read Also: Ranga Reddy: శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా

Telangana: Farmers’ insurance bandh for 15 lakh acres

రైతు భరోసా పథకంలో మార్పులు – ప్రభుత్వ స్పష్టత

ఈ లెక్కన సుమారు 75 లక్షల మంది రైతులకు భరోసా సాయాన్ని అందించాల్సి ఉంది. తెలంగాణలో సాగు చేసే భూములు 1.48 కోట్ల ఎకరాల మేర ఉన్నట్లు వ్యవసాయ శాఖ లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఇందులో ఒక్క వానాకాలం సాగు సీజనులో 1.36 కోట్ల ఎకరాల విస్తీర్ణంలో వివిధ పంటలు వేశారు. దీంతో పాటు, మరో 12 లక్షల ఎకరాల్లో కూరగాయలు, పండ్లు, పూల తోటలు సాగవుతున్నాయి. ఇవన్నీ కలిపి మొత్తంగా 1.49 కోట్ల ఎకరాలుగా ఉంది. ఇందులోనే పార్ట్ బి కేటగిరి కింద 18 లక్షల ఎకరాల సాగు భూమి ఉంది. గత ప్రభుత్వం పార్ట్ బి భూములను రైతు బంధు పథకం నుండి మినహాయించింది. ప్రస్తుత ప్రభుత్వం రెవెన్యూ రికార్డులను పరిగణనలోకి తీసుకుని పార్ట్ బి కేటగిరీ భూములతో పాటు, రాళ్లు, కొండలు, రప్పలు, గుట్టలు, రోడ్లు మార్పిడి తదితర వివాదాస్పద భూములన్నింటినీ తొలిగించి రైతుకు సంబంధించి సాగుచేసే పట్టా భూములనే లెక్కలేకి తీసుకోనుంది. గత వానాకాలం సీజనులో రాష్ట్రంలో మొత్తంగా 67.01 లక్షల రైతులకు 138.08 లక్షల ఎకరాల భూమికి గాను రూ.8,284.66 కోట్లను జమ చేసింది. వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం ఒక ఎకరం లోపల భూమి ఉన్న రైతులు 25 శాతం, అతిపెద్ద కమతం అయిన 15 ఎకరాలకు వరకు ఉన్న వారు 0.05 వాతం మాత్రమే ఉన్నట్టు లెక్కకట్టింది.

ఒక ఎకరం ఉన్న రైతులు

ఒక ఎకరం ఉన్న రైతులు 24.22 లక్షల మంది ఉండగా, 15.54 లక్షల ఎకరాల ఉంది. వీరికి రూ.812.63 కోట్లు అవసరం ఉంది. అలాగే 2 ఎకరాలు కలిగిన 17.02 లక్షల మందికి 25.62 లక్షల ఎకరాలు ఉండగా, ఇందుకు రూ.537.20 కోట్లు, 3 ఎకరాలు ఉన్న వాళ్లు 10.45 లక్షల మందికి 25.86 లక్షల ఎకరాలకు రూ.1,551.89 కోట్లు, 4 ఎకరాలు ఉన్న రైతులు 6.33 లక్షల మందికి 21.89 లక్షల ఎకరాలకు రూ.1,313.54 కోట్ల నిధుల అవసరం ఉంది. ఇక 5 ఎకరాలు ఉన్న 4.43 లక్షల మందికి 19.82 లక్షల ఎకరాలకు రూ.1,189.43 కోట్లు, 6 ఎకరాలు ఉన్న 1.71 లక్ష మందికి 9.16 లక్షల ఎకరాలకు రూ.549.80 కోట్లు, 7 ఎకరాలు ఉన్న 33 వేల మందికి 5.93 లక్షల ఎకరాలకు రూ.356.09 కోట్లు, 8 ఎకరాలు కలిగిన 67 వేల మందికి 4.43 లక్షల ఎకరాలకు రూ.265.91 కోట్లు, 9 ఎకరాలు కలిగిన 39 వేల మందికి 3.23 లక్షల ఎకరాల భూమికి రూ.194.32 కోట్లు రైతు భరోసాగా ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. అయితే ఇందులో వ్యవసాయ యోగ్యం కాని ఆటు ఇటుగా 10 లక్షల ఎకరాలు ఉంటుందని వ్యవసాయ అధికారులు లెక్క తేల్చారు. క్షేత్రస్థాయిలో వ్యవసాయ ఎక్స్టెన్షన్ అధికారులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా జరిపిన సర్వేలో 2.10 లక్షల ఎకరాలు సాగు యోగ్యం కానివిగా గుర్తించారు. అలాగే గ్రామ సభల్లో వచ్చిన విజ్ఞప్తులు, ఫిర్యాదుల అనంతరం వాటితో పాటు, ఇతర వడపోత కార్యక్రమాలతో ఇవన్నీ కలిసి సుమారు 1లక్షల ఎకరాలకు పెరిగినట్లు సమాచారం.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Revanth Reddy government Rythu Bharosa Scheme Telangana agriculture department Telangana Farmers

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.