Telangana Farmers Commission: రాష్ట్రంలో కూరగాయల సాగును భారీగా పెంపొందించేందుకు ప్రభుత్వ పూర్తిస్థాయి తోడ్పాటుతో పాటు, రైతులు తమ ఉత్పత్తులకు మేలైన గిట్టుబాటు ధరలు పొందేందుకు రైతులకు అందుబాటులోనే గ్రామాలలో మార్కెట్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని తెలంగాణ ఫార్మర్స్ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి అన్నారు.
శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం, ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆరు జిల్లాలనుంచి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల నుండి ఎంపిక చేసిన 150 మంది వెజిటబుల్ వాలంటీర్ రైతులకు కూరగాయల సాగుపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ ఫార్మర్స్ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు రైతులే క్షేత్రస్థాయిలో శాస్త్రవేత్త లని, కూరగాయలు విస్తీర్ణం పెంపు బాధ్యతలు రైతులు తమ భుజస్కందాలపై వేసుకొని ముందుకు తీసుకోవాలన్నారు.
Read Also: CM Revanth comments: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ఎంపీ బెయిల్‌పై రేవంత్ రెడ్డి స్పందన

ఉపాధి హామీ అనుసంధానం
ప్రత్యేకించి కూరగాయల పంటల సాగు విస్తీర్ణం, కూరగాయల స్వయం సమృద్ధికి కావలసిన సకల సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వ సిద్ధంగా ఉందన్నారు. ఉపాధి హామీ పనులు వ్యవసాయంతో అనుసంధానం చేయాలని ఎప్పటినుంచో కోరుతున్నట్లు తెలిపారు. తక్కువ ఖర్చుతో కూడిన చిన్న యంత్రాలు రైతులు సులభంగా వాడుకొని సాగు ఖర్చులు తగ్గించుకోవచ్చు అన్నారు. ‘వర్సిటీ ఆధ్వర్యంలో సూటి కూరగాయ రకాలు అభివృద్ధి చేయాలి. రైతుల ఆదాయాల పెంపుకు ఉద్యాన పంటల సాగు ఆశాజనకం’ అన్నారు. రైతు ఉత్పత్తి ఆర్గనైజేషన్లు తమ ఉద్యాన ఉత్పత్తులను విదేశాలకు సైతం ఎగుమతి చేయడం అభినందనీయమని తెలిపారు.
ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటు
ఉద్యాన ఆధారిత ప్రాసెసింగ్ పరిశ్రమలు నెలకొల్పేందుకు చర్చలు జరుపుతున్నామని, తద్వారా కోతనంతర పంట నష్టం తగ్గడం, రైతులకు వీటి సాగు ఆశాజనకంగా ఉంటుందని కోదండ రెడ్డి పేర్కొన్నారు. సాలీనా వర్షపాతం తెలంగాణలో 900 మిల్లీమీటర్లు ఉందని, ఈ వాతావరణం కూరగాయల సాగుకు అత్యంత అనుకూలమని తెలంగాణ ఉద్యాన విశ్వ విద్యాలయం వైస్ ఛాన్స్లర్ డాక్టర్ దండా రాజి రెడ్డి అన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు ఉద్యాన సాంకేతిక సమాచారం మార్పిడికి ప్రధాన కేంద్రాలుగా భవిష్యత్తులో ఎదుగుతాయని ఆయన తెలిపారు. అంతరం రైతులకు క్షేత్ర పర్యటన నిర్వహించి, సాంకేతికతలను ప్రత్యక్షంగా చూపించారు. రైతుల సందేహాలకు శాస్త్రవేత్తలు నేరుగా సమాధానాలు ఇచ్చారు. సర్టిఫికెట్ల అందించారు.కార్యక్రమంలో రిజిస్టర్ ఏ. భగవాన్, యూనివర్సిటీ అధికారులు లక్ష్మీనారాయణ, సురేష్ కుమార్, ప్రశాంత్, కూరగాయల పరిశోధన స్థానం అధిపతి డాక్టర్ అనిత కుమారి, ఉద్యాన శాఖ అడిషనల్ డైరెక్టర్ రాజ్ కుమార్, శాస్త్రవేత్తలు, ఉద్యాన శాఖ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: