తెలంగాణలో(Telangana) యాసంగి సీజన్ సందర్భంగా రైతు భరోసా పథకంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ సీజన్‌లో పంట సాగు చేయని భూములకు రైతు భరోసా అందించకూడదని, కేవలం నిజంగా సాగు జరుగుతున్న భూములకు మాత్రమే ఈ పథకం కింద ఆర్థిక సహాయం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.
Read Also: Rythu Bharosa: రైతుభరోసా డబ్బుల కోసం రైతుల ఎదురుచూపులు
సాగులో ఉన్న పంట భూములకే రైతు భరోసా నిధులు
ఈ నిర్ణయం ద్వారా అర్హులైన రైతులకు(Telangana) మాత్రమే రైతు భరోసా అందాలనే ఉద్దేశం ఉన్నట్లు తెలుస్తోంది. సాగు చేయకుండా భూములు ఖాళీగా ఉంచిన రైతులకు నిధులు ఇవ్వకుండా, పంటలు వేసే రైతులకు మద్దతు పెంచాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా పేర్కొంటున్నారు.
అయితే ఈ మార్పుల నేపథ్యంలో రైతు భరోసా నిధుల విడుదలలో కొంత ఆలస్యం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అర్హతల పరిశీలన, సాగు వివరాల నిర్ధారణ వంటి కారణాలతో చెల్లింపులు కొద్దిగా వెనుకబడవచ్చని సమాచారం. ప్రస్తుతం రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరానికి రూ.6,000 చొప్పున ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేస్తోన్న విషయం తెలిసిందే.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: