📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Latest news: Telangana: లక్కీడ్రా పేరుతో దోపిడీ

Author Icon By Saritha
Updated: November 14, 2025 • 10:45 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మంచి విత్తుల్లో నాసిరకం మిక్సింగ్

హైదరాబాద్ : రాష్ట్రంలో యాసంగి సీజను ప్రారంభమైన నేపధ్యంలో తెలంగాణలో పలు విత్తన సంస్థలు రైతులను నిలువునా ముంచేస్తున్నాయి. అమాయకులైన రైతులకు ఎరవేసి నకిలీ, నాసి రకం విత్తనాలు అంటగడుతున్నాయి. ఏజెన్సీలే లక్ష్యంగా విత్తన కంపెనీలు మోసాలకు తెగిస్తున్నాయి. అమాయక రైతులను(Telangana) లక్కీడ్రాల పేరుతో కొన్ని సంస్థలకు చెందిన ప్రతినిధులు వంచనకు గురి చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా బుకింగ్ చేయడంతోపాటు, బహుమతులు అంటూ బురిడీ కొట్టిస్తున్నారు. అందమైన బ్రోచర్లు, ఆకట్టుకునే విధంగా కరపత్రాలు చూపించి నకిలీ, నాసిరకం విత్తనాలును అంటగడుతున్నారు. రాష్ట్రంలో ఈ యాసంగి సీజనులో 68.67 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ(Department of Agriculture) అంచనా వేయగా, ఇందులో ప్రధాన పంట వరి అత్యధికంగా 51.48 లక్షల ఎకరాల్లో నాట్లు పడతాయని అంచనా వేసింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మార్కెట్లలో నకిలీలు, నాసికరం విత్తనాలు ప్రవేశించాయి.

Read also: సౌతాఫ్రికా పై భారత్-ఏ ఘన విజయం

Telangana: లక్కీడ్రా పేరుతో దోపిడీ

నకిలీ విత్తనాలు అంటగడుతున్న సంస్థలు

రాష్ట్రంలోని (Telangana)పలు ప్రాంతాల్లో విత్తన కంపెనీల ప్రతినిధులు రైతులను నమ్మించి బుట్టలో వేసుకుంటున్నారు. ఆషామాషీ కాదంటూ బంపర్ ఆఫ్ ప్రకటిస్తూ బోల్తా కొట్టిస్తున్నారు. కేవలం తమ కంపెనీ విత్తన ప్యాకెట్లు మూడు కొంటే చాలు జత ఎద్దులు, లేదంటే నగదు, ఇంకా రకరకాల గిఫ్టు ప్యాక్లంటూ గ్రామాల్లో ఊదరగొడుతున్నారు. గతంలో కూడా కొన్ని కంపెనీలు అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవడం, గిఫ్టుల పేరుతో దాదాపు వేల మంది రైతుల వద్ద నుండి ఒక్కొక్కరి వద్ద రూ.200 నుండి రూ.400 వరకూ లక్కీ డ్రా పేరిట వసూలు చేశారు. గిఫ్ట్ మాత్రం ఎవరికి రాలేదు సరికదా, ఇచ్చిన వరి, మిరప తదితర విత్తనాలు సైతం కాత, పూత లేక పెట్టుబడి సైతం నష్టపోవాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా అదే విధంగా మూడు విత్తన కంపెనీలకు చెందిన ప్రతినిధులు విత్తనాలు, గిఫ్ట్ల పేరుతో మళ్లీ వసూలు చేస్తున్నట్లు పలువురు బహిరంగంగా చెబుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

fake seeds Farmers Cheated Latest News in Telugu Lucky Draw Fraud Paddy Seeds Rabi Season Seed companies fraud seed scam Substandard Seeds Telangana agriculture Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.