Harish Rao : తెలంగాణ ఎక్సైజ్ శాఖలో మరో భారీ స్కామ్ బయటపడిందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. మైక్రో బ్రేవరీస్ అనుమతుల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని, ఇందులో కీలక నేతలు, వారి అనుచరులు భాగస్వాములయ్యారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
మొత్తం 110 అప్లికేషన్లు వచ్చినప్పటికీ, డ్రా పద్ధతి పాటించకుండా కొందరికి మాత్రమే అనుమతులు ఇవ్వాలని కుట్ర చేశారని తెలిపారు. ఒక్కో బ్రేవరీకి కోట్ల రూపాయల మేర అనధికారికంగా లావాదేవీలు జరిగాయని ఆరోపించారు. ఇదే కారణంగా ప్రభుత్వం బ్రేవరీస్‌కు చెల్లించాల్సిన వేల కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు.
Read Also: KCR phone tapping: ట్యాపింగ్ కేసులో కేసీఆర్ నోటీసులు?
బీరు కంపెనీలకు ఈ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని, రైతులను మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని హరీశ్ రావు విమర్శించారు. మెదక్ జిల్లాలో పంటలకు క్రాప్ హాలిడే ప్రకటించి, సంగారెడ్డిలో మాత్రం సింగూరు నీటిని బీరు కంపెనీలకు ఇస్తున్నారని మండిపడ్డారు. ఇది మద్యం కంపెనీలకు కొమ్ముకాసే ప్రభుత్వమని వ్యాఖ్యానించారు.
గౌడన్నలపై వందల కేసులు పెట్టి జైలుకు పంపారని, ప్రాణాలు కోల్పోయిన వారికి పరిహారం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా మార్చిందని హరీశ్ రావు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: