📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

News telugu: Telangana: పండుగ కల్తీలపై డేగ కన్ను..వ్యాపారులపై వలవేసిన ఎకైజ్ ఎన్ఫోర్స్మెంట్

Author Icon By Sharanya
Updated: September 16, 2025 • 2:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: తెలంగాణ సంస్కృతిలో దసరా, బతుకమ్మ పండుగలను ప్రత్యేకంగా జరుపుకుంటారు. పండుగల సందర్భంగా చుక్క.. ముక్క సంస్కృతి కొనసాగింపుగా ఉంటుంది. దసర, బతుకమ్మ పండుగలకు కొత్త బట్టలు, మద్యం సేవించడం పారిపాటి. ఇదే అదనుగా భావించే అక్రమార్కులు కల్తీ మద్యం(Adulterated liquor), ఫ్యూరియస్ లిక్కర్, నాన్ డ్యూటి పెయిడ్ లిక్కర్, నాటుసారా అమ్మకాలు జరిపి సొమ్ము చేసు కోవడానికి ప్రయత్నాలను ముమ్మరం చేస్తారు. వీరి అగడాలకు, అమ్మకాల కు అడ్డకట్టవేయడానికి ఎక్సైజ్ శాఖ ఈ నెల 30 వరకు ప్రత్యేక తనిఖీలు చేపట్టడానికి ప్రణాళికలు తయారీ చేశారు. పక్షం రోజుల పాటు ఈ నెల 30 తేదీ వరకు అన్ని కోణాల్లో దాడులు నిర్వహించాలని ఎక్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్ డైరక్టర్ షాన్వాజ్ ఖాసీం అదేశాలు జారీ చేశారు. ఎక్కువ ధరలు కలిగిన ప్రీమియం వీస్కీ మద్యాం బాటిళ్లలో తక్కువ ధరలు కలిగిన మద్యాన్ని నింపి అమ్మకాలు చేపట్టె వారిపై, కల్తీ మద్యాం తయారు చేసే కేర్రదాలపై, గోవా, ఢీల్లీ, హర్యానా ప్రాంతాల నుంచి దిగుమతి అయ్యే నాన్ డ్యూటి పెయిడ్ లిక్కర్, డిఫెన్స్ మద్యాం రవాణ, దిగుమతి, అమ్మ కాలపై వీటితోపాటు నాటుసారా తయారీ అమ్మకాలు, రవాణ, వినియోగంపై ఎక్సైజ్ శాఖ ఉక్కుపాదం మోపాలని డైరెక్టర్ అన్ని తనిఖీ టీమ్లకు అదేశాలు జారీ చేశారు.

ఫ్యూరియస్ లిక్కర్పై తెలంగాణ వ్యాప్తంగా ఎక్సైజ్తోపాటు ఎన్ఫోర్స్మెంట్ (Enforcement along with excise), ఎస్టిఎఫ్, టీడీఎప్ టీములు తనిఖీలు నిర్వహించ నున్నాయి. వరంగల్, మహాబూబాబాద్, అదిలాబాద్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలో కొద్ది ప్రాంతంలో తయారు అయ్యే నాటు సారా స్థావరాలపై ముక్ముడి దాడులు నిర్వహించాలని డైరెక్టర్ ఆదేశించారు. నాటు సారా తయారీతో పాటు సారా తయారీకి వినియోగించే ముడిసరుకు రవాణపై కూడ నిపతి పెట్టి అడ్డుకోవాలని అదేశించారు. ఢిల్లీ, హర్యానా, గోవా, డిఫెన్స్ క్యాంటిన్ల నుంచి అక్రమంగా దిగుమతి అయ్యే నాన్ డ్యూటి పెయిడ్ లిక్కర్ ఎక్కువగా రంగారెడ్డి, హైదారాబాద్, మహబూబ్నగర్, నల్లగొండ, మెదక్ డివిజన్లలో నిఘా బృందాలు దాడులు నిర్వహించాలని అదేశించారు. వీటీతోపాటు ఖాళీ గోదాముల్లోను, రైస్ మిల్లుల్లో అక్రమంగా తయారు అవుతున్న కల్తీమద్యం, ఫ్యూరియస్ లిక్కర్ తనిఖీలు ముమ్మరంగా చేయాలని అదేశించారు.

గత పదేళ్లలో ఎన్డీపీఎల్ కేసుల వివరాలు.. ఇలా ఉన్నాయి.

తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి నాన్ డ్యూటి పెయిడ్ లిక్కర్ అమ్మకాలపై ఎక్సైజ్శాఖ ఉక్కుపాదం మోపుతూ వస్తుంది. 2014 నుంచి 2025 ఆగస్టు నాటికి 4516 కేసులను ఎక్సైజ్ శాఖ నమోదా చేసింది. 3238 మందిని ఈ కేసుల్లో అరెస్టు చేసింది. 1,22,222 లీటర్ల మద్యాన్ని సీజ్ చేశారు. 616 వాహనాలకు కూడ స్వాధీన పరుచుకున్నారు. 2025 జనవరి నుంచి ఆగస్టు వరకు 644 కేసులు నమోదా చేసి 381 మందిపై కేసు నమోదా చేశారు. 8201 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 86 వాహనాలను సీజ్ చేశారు. తెలంగాణలో గత పదేళ్లలో నాటు సారా తయారీ అమ్మకాలు, రవాణ సమయాల్లో దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకొని నమోదు చేసిన కేసులు భారీగా ఉన్నాయి. 2014 నుంచి 2025 ఆగస్టు నాటికి నాటుసారా తయారీ, అమ్మకాలు, రవాణపై 2,75,028 కేసులు నమోదా చేశారు. 1,59,974 మందిపై కేసులు నమోదా చేశారు.

31,45,169 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు, 65,59,847 కేజీల నల్ల బెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. 18,065 వాహనాలను సీజ్ చేశారు. 2025 ఆగస్టు నాటికి 10,333 కేసులు నమోదా చేసి, 9694 మందిపై కేసులు నమోదా చేసి 48,180 లీటర్ల నాటుసారా ను స్వాధీనం చేసుకున్నారు. 2,06,848 కేజీల బెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. 1633 వాహనాలను సీజ్ చేశారు. 15 రోజుల పాటు స్టేట్ టాస్క్ ఫోర్స్ టీములు, ఎన్ఫోర్స్ మెంట్ టీమ్లు, జిల్లా టాస్ ఫొర్స్ టీములతోపాటు ఎక్సైజ్ స్టేషన్ల సిబ్బంది కలిసి ఎన్టీపీఎల్, నాటుసారా తాయీరా అమ్మకాలపై స్పెషల్ డ్రైవ్ చెపట్టనున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి రైళ్లలోను, వాహనాల్లోను, బస్సుల్లో వచ్చె నాన్్యూటి పెయిడ్ లిక్కర్ను, స్థానికంగా తయారు చేసే నాటు సారాను రాకుండా, లేకుండా చేయడమే లక్ష్యంగా దాడులు నిర్వహిస్తారు. 15రోజుల పాటు పటిష్టమైన దాడులు చేస్తామని షాన్వాజ్ ఖాసీం, (ఐపీఎస్), ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డెరెక్టర్ తెలిపారు.

Read hindi news:hindi.vaartha.com

Read also:

https://vaartha.com/sanjay-kumar-railway-safety-guidelines-mandatory/national/548117/

adulterated goods Breaking News excise enforcement fake products festival season raids latest news telangana excise Telangana news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.