Telangana: హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో (TSSPDCL) అవినీతి అధికారులదే ఇష్టా రాజ్యమైందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సంస్థ ప్రధాన కార్యాల యంలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న అధికారులతో పాటు, క్షేత్రస్థాయి అధికార్లు పలు వురిపై సైతం అవినీతి ఆరోపణలు చోటు చేసుకు న్నాయి. సంస్థ సిఎండి ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తున్న పలువురు అధికారులు అవి నీతికి చేయి చాస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి.
Read Also: Telangana: వ్యవసాయ వర్సిటీ ప్రశ్నపత్రాల లీక్ కేసు
ఎనిమిది మంది ఇంజనీర్లపై వేటు
ఈ నేపధ్యంలోనే దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో తాజాగా పలువురు ఇంజనీర్లపై వేటు పడింది. అవినీతి ఆరోపణలు ఉన్న ఎనిమిది మంది ఇంజనీరింగ్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సస్సెన్షన్కు గురైన వారిలో అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, సబ్ ఇంజనీర్లు ఉన్నారు. యాంటీ బ్రైబరీ సెల్కు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఇంటెలిజెన్స్ విభాగం ఇటీవల విచారణ చేపట్టింది.
డిజిటల్ పేమెంట్ ద్వారా లంచాలు వసూలు
ఈ క్రమంలో అవినీతి అధికారుల విషయంలో కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధానంగా కొత్తగా విద్యుత్ కనెక్షన్ల నిమిత్తం దరఖాస్తులు, ప్యానెల్ బోర్డులను ఏర్పాటు చేయడం, విద్యుత్ ట్రాన్ఫర్మర్లను మంజూరు చేయడం తదితర వాటికి సంబంధించి కొందరు అవినీతికి పాల్పడి, లంచాలు వసూలు చేస్తున్నట్లు ఈ విచారణలో వెల్లడయింది. ఈ అవినీతి సొమ్మును డిజిటల్ పేమెంట్ ద్వారా వసూలు చేసినట్లు ఆధారాలను సేకరించారు. దీనికి సంబంధించిన విచారణ నివేదిక ప్రభుత్వానికి సమర్పించిన నేపధ్యంలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థకు చెందిన 8 మంది ఇంజనీరింగ్ అధికారులను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: