📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Telangana: టెన్త్ విద్యార్థులపై విద్యాశాఖ కొత్త ప్లాన్!

Author Icon By Saritha
Updated: February 19, 2026 • 1:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Telangana: తెలంగాణ విద్యాశాఖ సరికొత్త ప్రణాళికను సిద్ధం చేసింది. మార్చి 14 నుంచి ప్రారంభం కానున్న ఎస్ఎస్‌సీ బోర్డు (SSC Board) పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా ‘సపోర్టివ్ ప్లాన్’ అమలు చేయాలని నిర్ణయించింది. ప్రీ-ఫైనల్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థులను వర్గీకరిస్తారు.

కనీస మార్కులు సాధించడంలో ఇబ్బంది పడుతున్న వారిని ‘స్ట్రగ్లర్స్’ (కేటగిరీ-1) గా, సగటు మార్కులు తెచ్చుకుంటున్న వారిని ‘యావరేజ్’ (కేటగిరీ-2) గా, అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్న వారిని ‘అడ్వాన్స్‌డ్’ (కేటగిరీ-3) గా విభజిస్తారు. ప్రతి కేటగిరీ విద్యార్థులకు వారి స్థాయికి అనుగుణంగా బోధన ఉంటుంది. వెనుకబడిన విద్యార్థులు సులువుగా పాస్ అయ్యేలా, ప్రతిభావంతులు 10/10 జీపీఏ సాధించేలా ప్రోత్సహిస్తారు.

Read Also: TG Inter Hall Tickets 2026: ఇంటర్ హాల్‌ టికెట్లు విడుదల

Telangana: Education Department’s new plan for 10th grade students!

పరీక్షల మధ్య 3 నుంచి 4 రోజుల సెలవులు ఉన్న నేపథ్యంలో, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రత్యేక తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశించింది. విద్యాశాఖ నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. పరీక్షల సమయంలో విద్యార్థులను మళ్లీ పాఠశాలలకు పిలవడం వారిపై అదనపు ఒత్తిడి పెంచుతుందని ఆందోళన చెందుతున్నాయి. ఈ విధానం వల్ల విద్యార్థులు స్వేచ్ఛగా ప్రిపేర్ అయ్యే అవకాశం కోల్పోతారని, హాజరుశాతం కూడా తక్కువగా ఉండొచ్చని వారు వాదిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

10th class Board Exams Exam Preparation special classes SSC exams Telangana Education Department Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.