Telangana Education: పిఎంశ్రీ స్కూళ్లను పరిశీలించనున్న సివిల్ సర్వెంట్స్

Read Time:  1 min
Telangana Education: పిఎంశ్రీ స్కూళ్లను పరిశీలించనున్న సివిల్ సర్వెంట్స్
FONT SIZE
GET APP

25 వరకు కొనసాగనున్న పరిశీలనలు

Telangana Education: రాష్ట్రంలోని పిఎంశ్రీ పాఠశాలలను కేంద్ర సివిల్ సర్వెంట్ అధికారులు పరిశీలించనున్నారు. కేంద్ర అధికారుల పరిశీలనలు ఈ నెల 25 వరకు కొనసాగనున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) స్వయంగా పిఎంశ్రీ స్కూల్స్ ను పరిశీలించి వాటిలో పిఎంశ్రీ పథకం అమలుతీరును తనను తెలియజేయాలని కేంద్ర విద్యాశాఖను ఆదేశించిన నేపథ్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాలో కొనపారుతును పిఎంట్ ప్రారంభించారు. కేంద్ర అధికారులు ఈ నెల 18 నుంచి 25 వరకు రాష్ట్రంలోని పిఎంశ్రీ పరిశీలన స్కూల్స్ లో పరిశీలన ఖమ్మం చేయనున్నారు.

Read Also: Bandi Sanjay : తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Telangana Education: పిఎంశ్రీ స్కూళ్లను పరిశీలించనున్న సివిల్ సర్వెంట్స్
Telangana Education: Civil servants to inspect PM Shri schools

10 జిల్లాల వారీగా రెండు రోజుల పాటు పర్యటనలు

అందులో భాగంగా జిల్లాలో కేంద్రం నుంచి వచ్చిన ఉన్నతాధికారి బుధవారం, గురువారం రెండు రోజులు పర్యటించారు. మొదటిరోజు రెండు స్కూళ్లలో తనిఖీలు నిర్వహించనున్న కేంద్ర అధికారి, అదే రోజు సాయంత్రం జిల్లా కలెక్టర్, డిఇఒతో పాటు పిఎంశ్రీ అమ్మలపుత్తును పాఠశాలల హెడ్నాపర్లతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. మరుసటిరోజు మరో రెండు పిఎంశ్రీ స్కూళ్లలో పరిశీలన చేపట్టనున్నారు. రాష్ట్రంలో 784 ఎంపిశ్రీ పాఠశాలలు కొనసాగుతున్నాయి. వాటిలో ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలు 520 ఉండగా.. మిగిలిన వివిధ సంక్షేమ శాఖ ద్వారా కొనసాగుతున్న గురుకుల స్కూల్స్ లో ఉన్నాయి. పిఎంశ్రీ స్కూల్స్ 124 ప్రాథమిక పాఠశాలలు ఉండగా.. మిగిలినవి హైస్కూల్స్ ఉన్నాయి. పిఎంశ్రీ స్కూల్స్ తనిఖీల ముఖ్యఉద్దేశ్యం పథకం అమలు తీరుతో పాటు.. ఇంకా అదనంగా చేపట్టాల్సినవి ఏమైనా ఉంటే వాటిని కూడా అదనంగా చేర్చాలని కేంద్రం భావిస్తున్న నేపథ్యంలో కేంద్ర అధికారులతో పరిశీలను చేపడుతునట్టు తెలుస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.