Telangana: పరారైన డ్రగ్స్ స్మగ్లర్ల కోసం దేశవ్యాప్తంగా ఈగల్ దాడులు

Read Time:  1 min
Telangana: పరారైన డ్రగ్స్ స్మగ్లర్ల కోసం దేశవ్యాప్తంగా ఈగల్ దాడులు
FONT SIZE
GET APP

Telangana : తెలంగాణలో డ్రగ్స్ దందాలు చేస్తూ పరారీలో వున్న 3228 మంది మాదకద్రవ్యాల స్మగ్లర్ల కోసం ఈగల్ (పూర్వపు టి. నాబ్) అధికారులు గత నెల 29వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాలలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 75 మంది కరుడుగట్టిన డ్రగ్స్ స్మగ్లర్లు(Drug smugglers) పట్టుబడగా ఇందులో 38 మంది మాదకద్రవ్యాలకు బానిసలుగా మారినట్లు తేల డంతో వీరిని వెంటనే ఎర్రగడ్డలోని మానసిక చికిత్స కేంద్రంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో చేర్చించారు.

Read Also: BC Commission :కులాల వారీగా విద్యార్థుల సమాచారం ఇవ్వండి

Telangana: Eagle raids across the country for fugitive drug smugglers
Telangana: Eagle raids across the country for fugitive drug smugglers

మూడునెలల పాటు వైద్యుల పర్య వేక్షణ

అక్కడ వీరంతా మూడునెలల పాటు వైద్యుల పర్య వేక్షణలో వుండాల్సి వుంటుంది. మూడు నెలల తరువాత వీరి ప్రవర్తనలో మార్పు వచ్చి. డ్రగ్స్క దూరంగా వుండే అవకాశాలుంటే కుటుంబ సభ్యులకు అప్పగించి వీరిపై వున్న కేసులను కోర్టుల్లో విచారణ ఎదుర్కొనేందుకు అనుమతిస్తారు.
తీవ్రమైన కేసులున్న వారిని జైళ్లకు తరలిస్తారు. పట్టుబడ్డ 75 మందిలో 38 మంది మినహా మిగతా వారిని రాష్ట్రం లోని ఆయా ప్రాంతాల పోలీసులకు అప్పగించారు. తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందు కు ఈగల్ చేస్తున్న కృషికి అన్ని వర్గాల వారు తమవంతు సహాయం చేయాలని ఈ విభాగం డైరెక్టర్ సందీప్ శాండిల్యా కోరారు.

ఈ మేరకు బుధవారం ఆయన మీడియాకు తెలిపారు. రాష్ట్రంలో డ్రగ్స్ దందా లు చేసి పరారీలో వున్న మిగతా వారిని పట్టుకునేందుకు దేశ వ్యాప్తంగా నిరంతరం దాడులు కొనసాగిస్తా మని ఆయన తెలిపారు. పరారీలో వున్న వారిపై ఎన్బి డబ్ల్యు వారంట్లు జారీ చేశామని, వీరు ఎక్కడ వున్నా వట్టుకుం టామని ఆయన తెలిపారు. డ్రగ్స్కు సంబం ధించిన సమాచారాన్ని ప్రజలు 1908 లేదా 8712671111కు తెలపాలని ఆయన కోరారు. వివరాలు తెలిపిన వారి సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని ఆయన వెల్లడించారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.