📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్

Latest News: Telangana: కాంగ్రెస్ ఎమ్మెల్యేల బెదరింపులకు భయపడవద్దు

Author Icon By Saritha
Updated: December 17, 2025 • 12:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్(Telangana) ఎమ్మెల్యేలకు అధికార మదం తలకెక్కిందని, ప్రజలను, ప్రజా ప్రతి నిధులను చంపేస్తామంటూ బరితెగించి మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో ఖానాపూర్, షాద్నగర్ నియోజకవర్గాల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యుల సన్మాన కార్యక్రమం జరిగింది.

మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే: కొత్త సర్పంచ్లకు కెటిఆర్ భరోసా

ఈ సందర్భంగా కేటీఆర్ వారికి వైఫల్యాలపై సుదీర్ఘంగా ప్రసంగించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. ఒక ఎమ్మెల్యే అయితే నన్ను ఓడించి చంపేస్తే.. నేను మిమ్మల్ని గెలిచి చంపేసా అని బహిరంగంగా బెదరింపులకు దిగుతున్నారు. ఎమ్మెల్యేల ప్రవర్తన చూసి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా గ్రామాల్లో అరాచకాలు చేస్తున్నారు. సర్పంచులు ఎవరూ. ఇలాంటి బెదరింపులకు లొంగవద్దు. ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వకపోవడానికి ఈ ఎమ్మెల్యేలు ఎవరు? ప్రజల పైసలతో కడుతున్న ఇళ్లకు అర్హులను ఎంపిక చేసే పూర్తి అధికారం గ్రామ సభలకు, సర్పంచులకే ఉంటుంది. ఎవడైనా అడ్డుతగిలితే తాట తీసి లైన్లో పెట్టండి’ అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే నిధులు దిక్కులేక ప్రపంచబ్యాంకుకు ఉత్తరాలు రాస్తు న్నారని, అలాంటి సర్పంచ్లకు ఏం ఇస్తారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రెండు సంవత్సరాల్లో
ఒక్క రూపాయి కూడా గ్రామ పంచాయతీలకు ఇవ్వని కాంగ్రెస్, ఇప్పుడు ఎలా గ్రామాలకు నిధులు ఇస్తారని కేటీఆర్ అన్నారు. రాజ్యాంగం ప్రకారం ఐదు అంచెల పాలనలో గ్రామ పంచాయతీలకు స్వయం ప్రతిపత్తి ఉందని గుర్తు చేశారు. కేంద్ర ఫైనాన్స్ కమిషన్ నుంచి రావాల్సిన రూ.3,500 కోట్ల నిధుల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేసి, రిజర్వేషన్లను 17 కి తగ్గించి హడావుడిగా ఎన్నికలు జరిపింది. ఫైనాన్స్ కమిషన్ నిధుల్లో 70 శాతం నేరుగా గ్రామ పంచాయతీలకే రావాలి. నిధులను ఆపే హక్కు ఏ ముఖ్యమంత్రికి గానీ, ఎమ్మెల్యేకు గానీ లేదు. మీ హక్కుల కోసం కొట్లాడండి, బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది’ అని హామీ ఇచ్చారు. ఇందుకోసం జిల్లాకొక ప్రత్యేక లీగల్ సెల్ ఏర్పాటుతోపాటు, స్థానిక ప్రజాప్రతినిధులకు ప్రత్యేక శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు. కేసీఆర్ పాలనలో వల్లెలు పచ్చగా ఉండేవని, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో అనాథలయ్యాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

Read also: TET: జనవరి 3 నుంచి 20వ తేదీ వరకు తెలంగాణ టెట్ పరీక్షలు

Telangana Do not be intimidated by the threats of the Congress MLAs.

రైతుల ఇబ్బందులు, సర్పంచ్ ఎన్నికల లో ప్రభుత్వం పరోక్ష ప్రచారం

కేసీఆర్(Telangana) హయాంలో ప్రతి గ్రామానికి ట్రాక్టర్, ట్యాంకర్, నర్సరీ, వైకుంఠ ధామం వచ్చాయి. తెలంగాణ పల్లెలు దేశానికే ఆదర్శంగా నిలిచి 30 శాతం జాతీయ అవార్డులు గెలుచుకున్నాయి. కానీ నేడు పరిస్థితి దారుణం. ట్రాక్టర్లకు డీజిల్ పోయించే దిక్కులేదు. రైతులు యూరియా కోసం లైన్లలో నిలబడి బాధలు పడుతున్నారని కెటిఆర్ అన్నారు. సర్పంచ్ ఎన్నికల కోసం ముఖ్యమంత్రి స్వయంగా జిల్లాలు తిరుగుతూ ప్రచారం చేయడం చరిత్రలో ఎన్నడూ లేదని కేటీఆర్ విమర్శించారు. ఎన్టీఆర్, వైఎస్ఆర్, కేసీఆర్ వంటి నాయకులు ఏనాడూ సర్పంచ్ ఎన్నికల కోసం రోడ్ల మీద పడలేదన్నారు. రేవంత్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని, అందుకే విజయోత్సవాల పేరుతో పరోక్ష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది ఇంకో రెండేళ్లే. మళ్ళీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే. మీరు ఐదేళ్ల కోసం గెలిచారు, మిగిలిన సగం కాలం మన ప్రభుత్వం లోనే అభివృద్ధి పనులు చేసుకుంటారు. ఖానాపూర్, షాద్ నగర్ గడ్డపై మళ్ళీ గులాబీ జెండా ఎగరడం ఖాయం’ అని ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎంపీటీసి, జడ్పీ ఎన్నికల్లో ఐకమ త్యంతో కలిసి పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, మాజీ ఎమ్మె ల్సీ కర్నె ప్రభాకర్, ఖానాపూర్ ఇన్చార్జి జాన్సన్ నాయక్, పెద్దసంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Congress Mlas KCR ktr Latest News in Telugu panchayat elections Rural Development Sarpanch support Telangana Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.