తెలంగాణలో త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల కోసం ప్రభుత్వం(Government) కీలక అడుగు వేసింది. జిల్లాల(Telangana) వారీగా రిజర్వేషన్ వివరాలను ఫైనలైజ్ చేస్తూ తాజాగా గెజిట్‌ను విడుదల చేసింది. జీవో నంబర్ 46 ప్రకారం గ్రామ పంచాయతీ స్థానాల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించగా, ఆయా స్థానాల విభజన విషయంపై స్పష్టత వచ్చింది.
Read also: విషమంగా బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా ఆరోగ్యం
జిల్లాల రిజర్వేషన్ జాబితా రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపిన ప్రభుత్వం
ఈ ప్రక్రియలో భాగంగా SC, STలకు కేటాయించిన రిజర్వేషన్ స్థానాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. అయితే BC రిజర్వేషన్లపై మాత్రం కొన్ని చోట్ల మార్పులు చోటుచేసుకున్నాయి. మొత్తం 22 శాతం రిజర్వేషన్ కోటా అమలు కావడంతో కొన్ని మండలాల్లో BCలకు కేటాయించిన పంచాయతీలు మార్పుకు గురయ్యాయి.
ప్రతి జిల్లాలోని(Telangana) గ్రామ పంచాయతీ స్థానాలు, వాటికి కేటాయించిన రిజర్వేషన్ వివరాలను జాబితాగా రూపొందించి రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా ప్రభుత్వం పంపించింది. ఎన్నికల నిర్వహణలో భాగంగా ఈ గెజిట్ కీలక పాత్ర పోషించనుండగా, త్వరలో ఎన్నికల షెడ్యూల్‌పై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: