📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telangana: రేషన్ కార్డులపై నిత్యావసరాల సరుకులు పంపణీ

Author Icon By Sharanya
Updated: May 31, 2025 • 10:30 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం చేపట్టిన నూతన చర్యల నేపథ్యంలో రేషన్ కార్డు లబ్ధిదారులకు ముఖ్యమైన తీపికబురు అందింది. ఇప్పటి వరకు ప్రతి నెలా రేషన్ బియ్యం మాత్రమే పొందుతున్న లబ్ధిదారులకు సన్నబియ్యం మాత్రమే కాకుండా, ఇకపై నిత్యావసర సరుకులు (Essential goods) కూడా ఇవ్వాలన్న నిర్ణయాన్ని సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయని వెల్లడించారు.

జూన్ 1 నుండి మూడు నెలల రేషన్ ఒకేసారి

ప్రస్తుతం రాష్ట్రంలో రేషన్ కార్డు (Ration card) ఉన్న ప్రతి కుటుంబ సభ్యుడికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ జరుగుతోంది. జూన్ 1 నుంచి మూడు నెలలకు సరిపడా సన్నబియ్యం ఒకేసారి ఇవ్వనున్నారు. త్వరలోనే రేషన్‌కార్డుదారులకు సన్నబియ్యంతో పాటు నిత్యావసర సరుకులు అందిస్తామన్నారు. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఉమ్మడి నల్గొండ జిల్లా సమీక్ష సమావేశం

సూర్యాపేట జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ఉమ్మడి నల్గొండ జిల్లా సమీక్ష సమావేశానికి మంత్రులు తుమ్మల, ఉత్తమ్, కోమటిరెడ్డి హాజరయ్యారు. అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు నల్గొండ ఇన్‌ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

తెలంగాణ ధాన్యోత్పత్తిలో వృద్ధి

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ధాన్యం ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలిచిందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 2.80 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి జరగడం ఇందుకు నిదర్శనంగా నిలిచిందని వివరించారు. వ్యవసాయంలో రైతులు మరింత లాభాలు పొందేందుకు ఆయిల్‌పాం సాగును ప్రోత్సహించాలని అధికారులను మంత్రి తుమ్మల ఆదేశించారు. త్వరలో నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఆయిల్‌పాం పరిశ్రమలను ప్రారంభిస్తామని తెలిపారు. నల్గొండ జిల్లాకు లక్ష టన్నుల సామర్థ్యం గల గోదాములను మంజూరు చేస్తామని వాటి నిర్మాణానికి అవసరమైన స్థలాలను గుర్తించాలని కలెక్టర్లకు సూచించారు.

ధాన్యం కొనుగోళ్లలో గణనీయ వృద్ధి

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, గత ఏడాది యాసంగి కాలంలో మే 29 నాటికి కేవలం 47 లక్షల టన్నుల ధాన్యాన్ని మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేసినా, ఈ ఏడాది అదే రోజుకు 67 లక్షల టన్నులను కొనుగోలు చేశామని తెలిపారు. వచ్చే వానాకాలం నుంచి ధాన్యాన్ని శుభ్రపరిచే, ఆరబెట్టే యంత్రాలను కొనుగోలు కేంద్రాలకు కేటాయిస్తామని వెల్లడించారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణపై దృష్టి సారించిన ప్రభుత్వం ఎస్సారెస్పీలో పూడికతీత పనులను ఇప్పటికే ప్రారంభించిందని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని సాగునీటి ప్రాజెక్టుల్లోనూ త్వరలో పూడికతీత పనులు చేపడతామని హామీ ఇచ్చారు.

పెండింగ్ పథకాల కోసం నిధుల కేటాయింపు

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, జూన్ 2 తర్వాత జరగనున్న మంత్రివర్గ సమావేశంలో పెండింగ్‌లో ఉన్న పథకాలకే కాదు, మ్యానిఫెస్టోలో లేకున్నా ప్రజలకు అవసరమైన అంశాలకు నిధులు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. నల్గొండ జిల్లాకు అత్యధికంగా రూ.1,700 కోట్ల మేర రహదారుల అభివృద్ధి నిధులు తీసుకువచ్చామని చెప్పారు. తెలంగాణలో వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రైతుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటుందని అన్నారు.

Read also: Rajiv Yuva Vikasam : రాజీవ్ యువ వికాసం తొలి విడతలో ఎంత మందికంటే?

#CivilSupplies #FreeEssentials #NityaAvasaraSarakulu #RationUpdates #RevanthReddyGovt #telangana #TelanganaWelfare #Tummala NageswaraRao #UttamKumarReddy Breaking News Today In Telugu Google News in Telugu India News Today in Telugu Latest News in Telugu Latest News today in Telugu News in Telugu Today Telugu News Today Today News In Telugu Today Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.