📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Breaking News: Telangana Crime – మహారాష్ట్రలో రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి

Author Icon By Digital
Updated: September 4, 2025 • 11:43 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇటీవల రోడ్డు ప్రమాదాలు అధికం అవుతున్నాయి. మితిమీరిన వేగం, నిర్లక్ష్యం, నిద్రమత్తు, మద్యం తాగి డ్రైవింగ్ చేయడం వంటి కారణాలతో ప్రమాదాలు పెరిగి, కుటుంబాలకు వేదనను మిగుల్చుతున్నారు. తాజాగా మహారాష్ట్రలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ(Telangana Crime)వాస్తులు మరణించారు.

దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణ నుండి మహారాష్ట్రలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాలజ్ కర్ర వినాయకుడి(Palaj Karra Ganesha) దర్శనానికి వెళ్లిన భక్తుల వాహనం ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో నిజామాబాద్ జిల్లాకు చెందిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

ఆగివున్న లారీని ఢీకొట్టిన కారు. నిజామాబాద్(Nizamabad) జిల్లాలోని వర్ని మండలం హుమ్నాపూర్ గ్రామం నుంచి 15 మంది భక్తులు మూడు కార్లలో నిన్న ఉదయం బయలుదేరారు. మహారాష్ట్రలోని పాలజ్ కర్ర వినాయకుడిని దర్శించుకున్న అనంతరం సాయంత్రం తిరుగు ప్రయాణం ప్రారంభించారు. మహారాష్ట్రలోని బోకర్ తాలూకా నందా గ్రామం వద్ద వారు ప్రయాణిస్తున్న కారు, రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక నుండి వేగంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో భార్యాభర్తలైన చేకూరి బుల్లిరాజు (53), సునీత (48), బుల్లిరాజు బావమరిది అర్ధాంగి వాణి (45) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే దుర్మరణం చెందారు. వాహనం నడుపుతున్న గుణం శేఖర్ కు తీవ్ర గాయాలు కావడంతో నిజామాబాద్ లోని ఒక ఆసుపత్రికి తరలించారు. కారులో ప్రయాణిస్తున్న మరో ప్రయాణికురాలు నీలిమ కూడా గాయపడ్డారు.

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బోకర్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దైవదర్శనం చేసుకుని, క్షేమంగా తమవారు తిరిగి వస్తారని భావించిన కుటుంబ సభ్యులకు తీరని ఆవేదనే మిగిలింది. మరికొన్ని గంటల్లో ఇంటికి చేరుకుంటారని ఎదురుచూస్తున్న కుటుంబీకులకు ఊహించని ప్రమాదంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Read Hindi news: Hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/ap-local-body-elections-in-january/breaking-news/540985/

Breaking News Crime News Telangana crime Telangana crime today Today crime news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.