తెలంగాణ (Telangana) లోని, ఖమ్మంలో కేటీఆర్ పోటీ చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సవాల్ విసిరారు. ఆయనకు దమ్ముంటే తన ఛాలెంజ్ స్వీకరించాలన్నారు. నిన్న ఖమ్మం వచ్చిన KTR ఏదేదో మాట్లాడారని, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గెలవడం మీ నాన్న తరం కాలేదు..నీ వల్ల ఏమవుతుందని అని అన్నారు. ముందు తన ఇంట్లో వ్యవహారం చక్కబెట్టుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ జోలికి వస్తే సత్తా చూపిస్తామని హెచ్చరించారు.
Read Also: Sangareddy: ‘food fest’ లో పాల్గొన్న సబ్ కలెక్టర్
వరుసగా దెబ్బలు తిన్నా బుద్ధి రాలేదు
ముందు కేటీఆర్ తన అవినీతి కేసుల గురించి చూసుకోవాలని, ప్రభుత్వం చట్టపరంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నించారని పొంగులేటి మండిపడ్డారు. ప్రభుత్వం జోలికి వస్తే కాంగ్రెస్ పార్టీ పవర్ ఏమిటో చూపిస్తామని హెచ్చరించారు. కేటీఆర్ మతి భ్రమించి రాహుల్ గాంధీ, గాంధీ కుటుంబంపై మాట్లాడుతున్నారని, సూర్యుడి పైకి ఉమ్మితే అది తిరిగి తన ముఖం మీదే పడుతుందని గమనించాలని అన్నారు.
అవినీతి, దోపిడీలకు పేటెంట్‌గా ఉన్న కల్వకుంట్ల ఫ్యామిలీ, గాంధీ కుటుంబం గురించి మాట్లాడటం సరికాదని మండిపడ్డారు. జాతీయ నాయకుడిని విమర్శిస్తే తాను కూడా జాతీయ నాయకుడినవుతానని తాపత్రయపడటంలో తప్పులేదు కానీ ఆశకు హద్దు ఉండాలని అన్నారు. ఎన్నికల్లో వరుసగా దెబ్బలు తిన్నా బుద్ధి తెచ్చుకోలేదని, ఆగ్రహం వ్యక్తం చేశారు. “మీరు రెఫరెండం అని చెప్పిన ఎన్నికల్లోనే ప్రజలు గూబ గుయ్యిమనిపించారు. జూబ్లీహిల్స్, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తీర్పు ఇచ్చారు. ఇప్పుడు రాబోయే మున్సిపల్ ఎన్నికలను సెమీ ఫైనల్స్ అంటున్నారు… దేనికి సెమీ ఫైనల్?” అంటూ ప్రశ్నించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: