Telangana: తెలంగాణ కోటాలో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాలకు అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. ఏఐసీసీ తరఫున అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్‌రెడ్డిలు నేడు అసెంబ్లీ ప్రాంగణంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఉపేందర్‌రెడ్డికి తమ నామినేషన్ పత్రాలను అందజేశారు. శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలో నామినేషన్లు వేశారు.
Read Also: Kalvakuntla Kavitha: తిరుమలకు బయలుదేరిన కవిత
ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పాల్గొన్నారు. కాగా రాష్ట్రం నుంచి రెండు స్థానాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ కాగా ఒక స్థానానికి సిట్టింగ్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీకే అవకాశం కల్పించగా రెండో స్థానానికి సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపింది. ఆ మేరకు ఇవాళ ఉదయం కాంగ్రెస్ అధిష్టానం తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది.
అధిష్టానానికి ధన్యవాదాలు
నామినేషన్ సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడిన వేం నరేందర్ రెడ్డి.. తనకు రాజ్యసభ అవకాశం కల్పించిన అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. పార్టీ ఆశీర్వాదం తనకు రాజ్యసభ అవకాశం దక్కిందన్నారు. అభిషేక్ సింగ్వీ మాట్లాడుతూ తనకు రెండో సారి అవకాశం ఇచ్చిన హైకమాండ్ కు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడతానని చెప్పారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: