📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా

Telangana: పంచాయితీ ఎన్నికల్లో విజయం వైపు దూసుకెళ్తున్న కాంగ్రెస్

Author Icon By Tejaswini Y
Updated: December 11, 2025 • 5:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ(Telangana)లో జరిగిన తొలి విడత పంచాయతీరాజ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. మొత్తం 4,236 స్థానాల్లో ఇప్పటివరకు 746 ఫలితాలు ప్రకటించగా, కాంగ్రెస్ 472 స్థానాలను కైవసం చేసుకుని స్పష్టమైన ఆధిక్యం సాధించింది. బీఆర్ఎస్(BRS) 142 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది. బీజేపీ 27 స్థానాలను గెలుచుకోగా, స్వతంత్రులు మరియు ఇతర పార్టీలు 106 స్థానాలను దక్కించుకున్నారు.

Read also: ఇద్దరు ఐఏఎస్ అధికారులకు హైకోర్టు షాక్.. నోటీసులు జారీ

Telangana: Congress is moving towards victory in the Panchayat elections

ఉత్కంఠ రేపిన పంచాయతీ ఫలితాలు

రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 3,834 గ్రామాల్లో సర్పంచ్ మరియు 27,678 వార్డు మెంబర్ పోస్టులకు ఓటింగ్ జరిగింది. మొత్తం పోలింగ్ శాతం 79.15గా నమోదైంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 87.93% పోలింగ్ జరిగింది. మెదక్ జిల్లాలో 86%, వరంగల్ జిల్లాలో 81.2% ఓటింగ్ నమోదైంది.

పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు

కొన్ని ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు రసవత్తరంగా సాగింది. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం ఆరేపల్లిలో సర్పంచ్ అభ్యర్థి స్రవంతి కేవలం 4 ఓట్ల తేడాతో గెలుపొందారు. కామారెడ్డి జిల్లా ర్యాగట్లపల్లిలో భాగ్యమ్మ పేరు మీదుగా 5 ఓట్ల తేడాతో విజయం దక్కింది.

మహబూబాబాద్ జిల్లా చీన్యా తండాలో BRS అభ్యర్థి హరిచంద్ 9 ఓట్ల తేడాతో గెలిచాడు. నల్గొండ జిల్లా తూర్పు తండాలో బీఆర్ఎస్ అభ్యర్థి భూక్య వీరన్న ఒక్క ఓటుతో విజయం సాధించడం విశేషం. కోరుట్ల మండలం తిమ్మయ్యపల్లెలో తల్లి-కూతురు పోరు చర్చనీయాంశం కాగా, కాంగ్రెస్ అభ్యర్థి పల్లపు సుమలత తన తల్లి గంగవ్వపై 91 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

BJP brs Congress victory local body elections Telangana Panchayat elections Vote Counting

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.