📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Telangana Collectors Meeting: పలువురు కలెక్టర్లపై సీఎం రేవంత్ ఆగ్రహం

Author Icon By Saritha
Updated: March 3, 2026 • 6:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Telangana Collectors Meeting: సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) అన్ని జిల్లాల కలెక్టర్లతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో అధికారులు, కలెక్టర్లకు పలు కీలక సూచనలు చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రాధాన్యత అంశాలు, పాలనాపరమైన సంస్కరణలపై ఈ సందర్భంగా చర్చించారు. ప్రజలకు పాలనను మరింత చేరువ చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.

Read Also: Technology : సాంకేతికత జోడిస్తేనే రైతుకు మేలు..

Telangana Collectors Meeting: CM Revanth is angry with many collectors

పనితీరు మార్చుకోవాలని ఆదేశం

మరోవైపు పలువురు కలెక్టర్లపై సీఎం సీరియస్ అయ్యారు. కొంత మంది కలెక్టర్లు జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉండటం లేదన్నారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి క్షేత్రస్థాయిలో అందుబాటులో లేకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో జాప్యం జరగకూడదని స్పష్టం చేశారు.

అలాంటి వారు తమ పని తీరు మార్చుకోవాలని సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 99 రోజుల పాటు జిల్లా విడిచి వెళ్లొద్దని ఆదేశించారు. ఈ గడువులోగా నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ పాలనను పరుగులు పెట్టించాలని సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

CM Revanth Reddy Collectors Conference Latest News in Telugu Telangana collectors Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.