📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Telangana: మున్సిపల్ ఎన్నికలపై సిఎం రేవంత్ రెడ్డి ఫోకస్

Author Icon By Tejaswini Y
Updated: February 3, 2026 • 11:36 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

‘చేతి’లో గెలుపు వ్యూహాలు!

Telangana : విదేశీ పర్యటన ముగిసి నగరానికి చేరుకున్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి(CM Revanth Reddy) అప్పుడే పార్టీ, పాలనా వ్యవహారాలపై ప్రధానంగా దృష్టి సారించారు. ఈ క్రమంలోనే మున్సిపల్ ఎన్నికలపై సోమవారం ఆయన మంత్రులతో, నేతలతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల బరిలో రెబల్స్ లేకుండా చూడాలని, గెలిచే అభ్యర్థులకే బిఫారాలు అందజేయాలని టిపిసిసి చీఫ్ మహేశ్కుమార్ గౌడ్కు సూచించారు. అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచేలా వ్యూహాత్మకంగా వెళ్లాలని పేర్కొన్నారు.

Read Also: HYD Crime: హుస్సేన్‌సాగర్‌లో దూకి యువతి ఆత్మహత్య?

Telangana: CM Revanth Reddy focuses on municipal elections

నేడు మంత్రులు, నేతలతో సమావేశం

ఈ క్రమంలోనే ఆయన మంగళవారం సాయంత్రం 6.30 గంటలకు జూబ్లీహల్స్ లోని తన నివాసంలో పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా నియమితులైన మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జ్ మంత్రులతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, అభివృద్ధి పనులు, జిల్లాల వారీగా సంక్షేమ పథకాల అమలుపై చర్చించేందుకు ఈ భేటీని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి ఎఐసిసి ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టిపిసిసి చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కూడా హాజరు కానున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, పార్టీ బలోపేతం, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలపై సిఎం రేవంత్రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. కాగా, మున్సిపల్ ఎన్నికలపై టిపిసిసి ఎన్నికల కమిటీ చర్చించింది.

స్క్రీనింగ్ కమిటీ సిఫారసు మేరకే బిఫామ్స్ అందజేత

జూమ్ మీటింగ్లో సిఎం రేవంత్రెడ్డి, టిపిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, నేతలు చర్చించారు. స్క్రీనింగ్ కమిటీ సిఫారసు మేరకే బిఫామ్స్ ఇవ్వాలని ఈ భేటీలో నిర్ణయించారు. ఈ కమిటీ సిఫారసు చేసిన జాబితాను ఆమోదిస్తూ ఏకగ్రీ తీర్మానం చేశారు. కాగా, వివిధ జిల్లాల్లో కాంగ్రెస్లో బిఫారాల గొడవ కొనసాగుతోంది. పలు చోట్ల ఎమ్మెల్యేలు తమ అనుచరులకే టిక్కెట్ కావాలని పట్టుబడటంతో సర్దుబాటు కోసం మంత్రులకు సూచనలు చేసినట్లు తెలిసింది. బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన పలువురు ఎమ్మెల్యేలు ఉన్న చోట కాంగ్రెస్ పాత నేతలు తమకే టిక్కెట్ కావాలని పట్టుబడుతున్నట్లు సమాచారం.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

CM Revanth Reddy Congress B-Forms jubilee hills meeting Mahesh kumar Goud Meenakshi Natarajan Telangana Municipal Elections Telangana politics TPCC

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.