📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Telangana: UPSC విజేతలకు సీఎం రేవంత్ అభినందనలు

Author Icon By Anusha
Updated: March 7, 2026 • 12:23 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Telangana: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ 2025 తుది ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే.. మొత్తంగా ఈ ఏడాది సివిల్స్‌లో 958 మంది ఎంపికైనట్లు యూపీఎస్సీ ప్రకటించింది. తుది ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు, ముఖ్యంగా తెలంగాణ యువత అసాధారణ ప్రతిభను చాటారు. విజేతగా నిలిచిన అభ్యర్థులకు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

Read Also: Handicrafts Exhibition: ఇందిరా మహిళాశక్తి బజార్లో హస్తకళల ప్రదర్శన ప్రారంభం

దేశ ప్రగతిలో భాగస్వాములై మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నా

ప్రజా ప్రభుత్వం, సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ‘రాజీవ్ సివిల్స్ అభయ హస్తం‘ పథకం ద్వారా సాయం అందుకున్న తెలంగాణ అభ్యర్థుల్లో 20 మంది సివిల్స్ తుది ఫలితాల్లో మంచి ర్యాంకులతో విజేతలుగా నిలవడం అభినందనీయం. గత ప్రభుత్వం పేదల బిడ్డలు బర్లు, గొర్లు కాసుకుని బతకాలని భావించింది.

మన ప్రభుత్వం వారి విద్యకు ప్రాధాన్యత ఇచ్చి ఐఎఎస్ లు, ఐపీఎస్ లు గా ఎదగాలని తోడుగా నిలుస్తోంది. కొత్తగా అఖిల భారత సర్వీసులకు ఎంపికైన అభ్యర్థులు దేశ ప్రగతిలో భాగస్వాములై మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను. మీరు ఏ కేడర్ లో ఉన్నా తెలంగాణ పునర్నిర్మాణంలో మీ వంతు పాత్ర పోషించాలని కోరుకుంటున్నాను.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

CM Revanth Reddy Congratulates Civils Rankers Rajiv Civils Abhaya Hastham Scheme Success Singareni Collieries Civils Coaching UPSC Civils 2025 Results Telangana Winners

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.