📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త 23వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం రైతులకు శుభవార్త నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు ఉద్యమ బాటలో ఆర్టిసి కార్మికులు రేపటి నుంచి JEE మెయిన్స్ ప్రైవేట్ స్కూల్ ఫీజులపై బ్రేకింగ్ నిర్ణయం.. తల్లిదండ్రులకు ఊరట? సంక్రాంతి పండుగతో టిజిఎస్ఆర్టీసీ కి భారీ లాభాలు ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త 23వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం రైతులకు శుభవార్త నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు ఉద్యమ బాటలో ఆర్టిసి కార్మికులు రేపటి నుంచి JEE మెయిన్స్ ప్రైవేట్ స్కూల్ ఫీజులపై బ్రేకింగ్ నిర్ణయం.. తల్లిదండ్రులకు ఊరట? సంక్రాంతి పండుగతో టిజిఎస్ఆర్టీసీ కి భారీ లాభాలు

Telangana :నైనీ బొగ్గు టెండర్లపై కేంద్ర శాఖ కీలక భేటీ

Author Icon By Pooja
Updated: January 21, 2026 • 2:50 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నైనీ బొగ్గు టెండర్ల వ్యవహారం తెలంగాణ(Telangana) రాజకీయాల్లో వేడి పెంచుతోంది. ఈ టెండర్లలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి వెంకట్‌రెడ్డిలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ఆరోపణలను కాంగ్రెస్ నాయకత్వం ఖండిస్తున్నప్పటికీ, రాజకీయ దుమారం మాత్రం తగ్గడం లేదు.

Read Also: TG: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేపై దాడి ఘటనను ఖండించిన కేటీఆర్

Telangana: Central ministry holds crucial meeting on Naini coal tenders.

కేంద్ర శాఖ అత్యవసర సమావేశం

ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హరీశ్‌రావు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డికి సవాల్ విసిరారు. ఈ వ్యవహారంలో ఎలాంటి అవకతవకలు లేనట్లయితే స్వతంత్రంగా విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం స్పందించి విచారణకు ఆదేశిస్తే నిజాలు వెలుగులోకి వస్తాయని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు.

తదుపరి చర్యలపై నిర్ణయం

ఈ రాజకీయ(Telangana) ఒత్తిడి నేపథ్యంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ ఉన్నతాధికారులు మంత్రి ఆదేశాలతో అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు. నైనీ బొగ్గు బ్లాక్‌తో పాటు ఇతర బొగ్గు గనుల కేటాయింపులు, టెండర్ ప్రక్రియలపై కూడా సమీక్ష చేపట్టనున్నారు. ఈ సమావేశం అనంతరం ప్రాథమిక నివేదికను సిద్ధం చేసి, తదుపరి చర్యలపై కేంద్రానికి నివేదించే అవకాశం ఉందని సమాచారం. ఈ పరిణామాలు రాష్ట్రంలో కాంగ్రెస్–బీఆర్ఎస్ మధ్య రాజకీయ ఉద్రిక్తతను మరింత పెంచుతున్నాయి. విచారణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ఈ అంశం మరింత కీలక మలుపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

CoalTenderRow Google News in Telugu Latest News in Telugu NainiCoal

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.