తెలంగాణ (Telangana) రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపుగా, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్(cabinet) విస్తరణ చేపట్టి సామాజిక సమీకరణాలకు అధిక ప్రాధాన్యతనిచ్చింది. ఆదివారం నాడు మధ్యాహ్నం 12 గంటలకు రాజ్ భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సమక్షంలో ముగ్గురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణస్వీకారం చేసిన వారిలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఉన్నారు.
కొత్త మంత్రులు – సామాజిక వర్గాల ప్రతినిధులుగా
ఈ ముగ్గురు నేతలు రాష్ట్రంలోని విభిన్న సామాజిక వర్గాలను ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
గడ్డం వివేక్ – ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన వారు
అడ్లూరి లక్ష్మణ్ – ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారు
వాకిటి శ్రీహరి – బీసీ ముదిరాజ్ వర్గానికి చెందిన నాయకుడు
ఈ ముగ్గురు నియామకంతో కేబినెట్‌లో దళితుల సంఖ్య 4కి పెరిగింది. అలాగే బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రుల సంఖ్య ముగ్గురికి చేరింది, ఇది కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయంపై ఉన్న నిబద్ధతను నిరూపిస్తుంది.
సమాజిక న్యాయం – కాంగ్రెస్ ధ్యేయంగా
తెలంగాణ కేబినెట్ విస్తరణలో సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత కల్పించారు సీఎం రేవంత్‌రెడ్డి. ఎస్సీ మాల, ఎస్సీ మాదిగ, బీసీ ముదిరాజ్ సామాజిక వర్గాల నుంచి కేబినెట్‌లోకి గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరికి చోటు కల్పించారు. ఎస్టీ ఆదివాసీ నుంచి ఇప్పటికే మంత్రిగా సీతక్క కేబినెట్‌లో ఉన్నారు. అయితే ఈసారి విస్తరణలో రెడ్లకు చోటు దక్కలేదు.
డిప్యూటీ స్పీకర్ గా రామచంద్రునాయకన్
కేబినెట్ విస్తరణతో పాటు తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా రామచంద్రునాయకన్ ఎంపిక చేయబడడం మరో ముఖ్యాంశం. ఆయన కూడా బీసీ వర్గానికి చెందినవారు కావడం గమనార్హం.
తాజా విస్తరణలో కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయాన్ని పరిగణనలోకి తీసుకున్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మాత్రమే అవకాశం కల్పించింది. కాగా, ఈసారి మంత్రివర్గ విస్తరణలో సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలకు చోటు దక్కుతుందని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతానికి ఎస్సీ, బీసీలకు మాత్రమే అవకాశం ఇవ్వాలని అధిష్టానం సూచించినట్లు తెలిసింది.
Read also: Fish Market: మృగశిర కార్తె- చేపల మార్కెట్లలో రద్దీ
Saleem: మద్యం మత్తులో భార్య అనుకుని పక్కింటి యువతిని పొడిచిన భర్త