📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telangana: మరింత ఆలస్యం కానున్న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ

Author Icon By Sharanya
Updated: May 27, 2025 • 2:46 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు సంబంధించి తీవ్రంగా ఎదురుచూస్తున్న సమయంలో, మరోసారి ఆ ప్రక్రియకు బ్రేక్ పడింది. ఇప్పటి వరకు మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న పదవులను భర్తీ చేయకపోవడం, పార్టీ నాయకత్వ స్థాయిలో చర్చలు ఇంకా పూర్తికాకపోవడం గమనార్హం.

ఖర్గే ఆరోగ్య కారణాలతో సమావేశానికి ఆటంకం

మంత్రివర్గ విస్తరణపై నిర్ణయం తీసుకోవాల్సిన ఎఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రస్తుతం ప్రకృతి చికిత్స లో ఉన్న ఖర్గే షెడ్యూల్ ప్రకారం సోమవారం ఢిల్లీకి చేరుకోవాల్సి ఉంది. అయితే వైద్యుల సూచలన మేరకు ఆయన చికిత్స్ మరో రెండు రోజులు కొనసాగనున్నట్లు ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 30 వ తేదిన ఖర్గే ఢిల్లీ చేరుకోనున్నారు. దీంతో ఈ సమావేశం ఈ నెల 30 కి మీటింగ్ ను వాయిదా వేశారు. దీంతో రెండు రోజులు ఎదురు చూపుల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు వెనుదిరిగారు. సోమవారం అక్బర్ రోడ్ లోని జన్ పథ్ 10 లో రాహుల్ గాంధీతో పార్టీ వ్యవహారాల జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ లు వేరు వేరుగా భేటి అయ్యారు. సాయంత్రం 5:15 కు ప్రారంభమైన ఈ సమావేశం గంట పాటు సాగింది.

పీసీసీ చీఫ్ భేటీలు – బీసీలకు ప్రాధాన్యత కోరిన విజ్ఞప్తి

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఢిల్లీలో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ తో వేర్వేరు సమావేశాలు జరిపారు. సాధ్యమైనంత త్వరగా క్యాబినేట్ విస్తరణ చేపట్టాలని, అందులో బీసీలకు రెండు పదవులు ఇవ్వాలని మహేశ్ కుమార్ గౌడ్ రాహుల్ ని కోరినట్లు తెలిసింది. ప్రస్తుతం బీసీ కుల గణన తో దేశ వ్యాప్తంగా వెళ్తోన్న నేపథ్యంలో ఈ నిర్ణయం పార్టీకి మరింత కలిసి వస్తుందని వ్యక్తిగత అభిప్రాయాన్ని తెలిపినట్లు సమాచారం. అలాగే కార్యవర్గంలోనూ వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఇతర పదవుల్లో బీసీలకు సముచిత స్థానం కల్పించాలని కోరారు. ఐదు బెర్త్ లకు సంబంధించి ఏడుగురి పేర్లను ప్రియార్టీలో ఉన్నట్లు తెలిపారు. అలాగే నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు, తక్కువ సంఖ్యతో కూడిన పీసీసీ కార్యవర్గ లిస్ట్ ను సమర్పించారు. వీటిపై కేసీ వేణుగోపాల్ బ్రీఫ్ చేయగా అనంతరం పీసీసీ చీఫ్ కుటుంబ సమేతంగా రాహుల్ గాంధీని కలిసారు. కుటుంబ వారితో కాసేపు ముచ్చటించిన రాహుల్, తర్వాత మహేశ్ కుమార్ గౌడ్ తో ప్రత్యేకంగా భేటి అయ్యారు.

సీఎం రేవంత్‌కు అపాయింట్మెంట్ లేకపోవడంపై రాజకీయ చర్చ

ఈసారి పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌కు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇచ్చినప్పటికీ, సీఎం రేవంత్ రెడ్డికి ఇవ్వకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తమ రిక్వెస్ట్ పై రాహుల్ సానుకూలంగా స్పందించారని త్వరగా చేస్తామని హామీ ఇచ్చారన్నారు. మర్యాద పూర్వకంగా కుటుంబ సమేతంగా రాహుల్ గాంధీని కలిసినట్లు మహేశ్ కుమార్ చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అంశాలను రాహుల్ గాంధీకి వివరించినట్లు తెలిపారు. తెలంగాణ క్యాబినెట్‌లో బీసీలకు ప్రాధాన్యత కల్పించాలని అధిష్టానాన్ని కోరామన్నారు. త్వరగా క్యాబినేట్ కూర్పు చేయాలని రాహుల్ ని విజ్ఞప్తి చేశామని త్వరలో ఉంటుందని ఆశిస్తున్నామన్నారు. ఒకటి, రెండు రోజుల్లో పీసీసీ కార్యవర్గం ప్రకటన ఉంటుందని వెళ్లడించారు.

సీఎంతో పీసీసీ సమావేశం

మంత్రివర్గంలో ఇప్పటికీ ఖాళీగా ఉన్న పదవులు, అనేక శాఖలు పూర్తిస్థాయిలో పనిచేయకపోవడం పరిపాలన పరంగా కూడా సమస్యలను కలిగిస్తోంది. రాహుల్ తో భేటి అనంతరం పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ నేరుగా తుగ్లక్ రోడ్ 23 లోని సీఎం అధికారిక నివాసానికి చేరుకున్నారు. దాదాపు అరగంట పాటు సీఎంతో చర్చించారు. రాహుల్ తో భేటి సందర్భంగా జరిగిన అంశాలను బ్రీఫ్ చేశారు. ప్రస్తుతం ఖర్గే అందుబాటులో లేనందున ఈ నెల 30 కి మీటింగ్ ను వాయిదా వేసిన విషయాన్ని వివరించారు.

Read also: Rajiv Yuva Vikasam Scheme : రేపటితో ఎంపిక పూర్తి

#CabinetExpansion #CongressGovt #PoliticalUpdate #RevanthReddy #TelanganaMinisters #TelanganaPolitics Breaking News Today In Telugu Google News in Telugu India News Today in Telugu Latest News in Telugu Latest News today in Telugu News in Telugu Today Telugu News Today Today News In Telugu Today Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.