తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి డిసైడ్ అయ్యింది. మంత్రివర్గ విస్తరణ (Cabinet Expansion)కు సంబంధించి కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ (High command green signal) ఇచ్చినట్లు సమాచారం. దీంతో రేపు మంత్రివర్గ విస్తరణ జరగనున్న అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పదవిలో ఉన్న మంత్రులతో పాటు కొత్త నేతలకు కూడా మంత్రి పదవులు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు.
కొత్తగా ముగ్గురికి లేదా నలుగురికి ఛాన్స్
ఈ విస్తరణలో కొత్తగా ముగ్గురు లేదా నలుగురికి చోటు దక్కే అవకాశం ఉందని వర్గాల సమాచారం. పార్టీలోని అనేక మంది సీనియర్ నాయకులు మంత్రి పదవుల కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో, సామాజిక సమతుల్యతకు ప్రాధాన్యత ఇస్తూ ఎంపిక ప్రక్రియ కొనసాగుతున్నట్లు సమాచారం. వివిధ జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించేందుకు పార్టీ వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటున్నదని తెలుస్తోంది.
కొత్త మంత్రులెవరా అనేదానిపై ఉత్కంఠ
ఇవాళ సాయంత్రం రాజ్‌భవన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కొత్త మంత్రుల పేర్లు ఖరారు కావడంతో ఉత్సుకత నెలకొంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ హైకమాండ్ మధ్య ఈ అంశంపై పలు దఫాల చర్చలు జరిగినట్లు తెలిసింది. కాబినెట్ విస్తరణతో పరిపాలన మరింత వేగంగా సాగుతుందని కాంగ్రెస్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
Read Also : Rajasthan: ICICI బ్యాంకు లో ఖాతదారుల నగదు చోరీచేసిన మహిళా ఉద్యోగి