Telangana Budget updates: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2026-27లో డ్వాక్రా (SHG) మహిళా సంఘాలకు కాంగ్రెస్ ప్రభుత్వం గొప్ప ఊరటనిచ్చింది. శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాలకు రూ. 2,500 కోట్ల వడ్డీలేని రుణాలను మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ నిధులను బడ్జెట్లో ప్రత్యేకంగా కేటాయించడం ద్వారా మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు మార్గం సుగమమైంది.
Read Also:Telangana ST Welfare Budget: గిరిజన రైతులకు 100% సబ్సిడీతో సోలార్ పంపులు

Telangana Budget updates: ₹2,500 కోట్ల వడ్డీలేని రుణాలు!
రాష్ట్రంలోని గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఉన్న మహిళలను ‘కోటీశ్వరులను’ చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు చిన్న తరహా పరిశ్రమలు, వ్యాపారాలు స్థాపించుకునేలా ప్రోత్సహించడమే ఈ వడ్డీలేని రుణాల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం. దీనివల్ల లక్షలాది మంది మహిళా సభ్యులకు వడ్డీ భారం తప్పడమే కాకుండా, వారి కుటుంబ ఆదాయం పెరిగే అవకాశం ఉంది.
18 ఏళ్ల నుండి 61 ఏళ్లు పైబడిన వారు కూడా సంఘాల్లో చేరే అవకాశం
డ్వాక్రా సంఘాల విస్తరణపై కూడా ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. ఇప్పటివరకు ఉన్న నిబంధనలను సడలిస్తూ, 18 ఏళ్లు నిండిన యువతుల నుండి 61 ఏళ్లు దాటిన వృద్ధ మహిళల వరకు అందరినీ ఈ సంఘాల్లో సభ్యులుగా చేర్చుకోవాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల మరిన్ని కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు, రుణ సదుపాయాలు అందుతాయని భావిస్తున్నారు. ప్రభుత్వ తాజా ప్రకటనపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డ్వాక్రా మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: